నేరాల అదుపులో యోగీ సర్కార్ విఫలం: ప్రియాంక

129
priyanaka

ఉత్తర ప్రదేశ్‌లో నేరాల అదుపులో ముఖ్యమంత్రి యోగీ సర్కార్ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన ప్రియాంక…నేరాల రేటును కప్పి పుచ్చుకునే ప్రయత్నం యోగీ సర్కార్ చేస్తోందని మండిపడ్డారు.

నేరాల రేటును సూచించే గ్రాఫ్‌ను షేర్ చేసిన ప్రియాంక…. రాష్ట్రంలో నిత్యం వందల సంఖ్యలో నేరాలు జరుగుతున్నాయని చెప్పారు. ఎరువుల కుంభకోణం గురించి ఓ ప్రధాన హిందీ దినపత్రికలో వచ్చిన కథనాన్ని సైతం ప్రస్తావించారు ప్రియాంక. బీజేపీ ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించకుండా బెదిరింపు ధోరణి అవలంభిస్తుందని ఇది సరికాదన్నారు.