గొప్ప సంకల్పానికి నాంది పలికిన కెన్నేడి హై ది మాగ్నెట్ స్కూల్

525
kennedy high school
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ఒక యజ్ఞంలా నిర్వహిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో మరో అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైంది, చిన్నపిల్లలంతా తమ తమ ఇండ్ల వద్దే ఉండీ చిట్టి చేతులతో మొక్కలు నాటే కార్యక్రమానికి కెన్నేడి ఇంటర్నేషనల్ స్కూల్ నాంది పలికింది.

కెన్నేడి స్కూల్ పూర్వ విద్యార్థిని మిస్ ఇండియా రన్నరప్ శ్రేయరావ్ ఇటీవలే గ్రీన్ ఛాలెంజ్ లో మూడు మొక్కలు నాటి తన సహచర మిస్ ఇండియా కాంటెస్టెంట్స్ లకు ఛాలెంజ్ విసిరింది.గ్రీన్ ఛాలెంజ్ ని శ్రేయ రావ్ నుండి స్వతాః గా స్వీకరించిన కెన్నేడి స్కూల్ మేనేజ్మెంట్ తమ విద్యార్థులకు ఉపాధ్యాయులకు అలాగే స్కూల్ సిబ్బందికి మొక్కలు నాటల్సిందిగా కోరింది.

అందులో భాగంగా ఇవాళ విద్యార్థులు,ఉపాధ్యాయులు తమ తమ ఇళ్ల దగ్గర మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కెన్నేడి స్కూల్ యాజమాన్యం మాట్లాడుతూ గౌరవ రాజ్యసభ సభ్యులు సంతోష్ గారు చేపట్టిన ఈ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం చాలా గొప్పదని ఇలా ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళితే ఈ రోజు రాష్ట్రం అదే విధంగా మన దేశం మొత్తం ఒక హరితప్రాంతంగా మారుతుందని ఆకాక్షించారు. ప్రతీ ఒక్కరు ఒక మొక్క నాటి పుడమితల్లి రుణం తీర్చుకోవాలని కోరారు.ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఎంపీ సంతోష్ కుమార్ గారికి అదే విధంగా మిస్ ఇండియా రన్నరప్ శ్రేయరావు కి ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -