చెట్లను నాటి సంరక్షించండి: మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్

184
ktr
- Advertisement -

తెలంగాణను ఆకుపచ్చవనంలా మార్చేందుకు సీఎం కేసీఆర్ హరితయజ్ఞాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 5 విడతల హరిత హారం కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని 6వ విడత హరితహారం విజయవంతంగా సాగుతోంది. సీఎం కేసీఆర్ కృషితో దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలోని ప్రతీ పల్లెలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నర్సరీలు ఏర్పాటయ్యాయి. నర్సరీలేని గ్రామం లేదంటే అతిశయోక్తికాదు.

ఈ నేపథ్యంలో ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో ఒక్కో వ్యక్తి సగటున అతి తక్కువ 28 చెట్లను కలిగిఉన్నారని అందుకే చెట్లునాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.

ఇందుకు సంబందించి వివిధ దేశాల గణాంకాలను కూడా షేర్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఒక్కో వ్యక్తి 422 చెట్లు మాత్రమే కలిగిఉండగా కెన‌డాలో ఒక్కో వ్య‌క్తి 10,163 చెట్ల‌ను క‌లిగి ఉన్నాడు. అదే గ్రీన్‌ల్యాండ్‌లో 4,964, ఆస్ర్టేలియా- 3266, యూనైటెడ్ స్టేట్స్- 699, ఫ్రాన్స్- 203, ఇథియోపియా-143, చైనా- 130, యునైటెడ్ కింగ్‌డ‌మ్- 47 చెట్లు కలిగి ఉన్నారని తెలిపారు.అందుకే హరిత హారం,ప్రతి ఒక్కరు ఒక మొక్కను నాటడం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాల్లో పాల్గొనాలని వెల్లడించారు.

- Advertisement -