21 లక్షలకు చేరువలో కరోనా కేసులు..

212
corona
- Advertisement -

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 21 లక్షలకు చేరువయ్యాయి. కొద్దిరోజులుగా 60 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతుండగా అదే ట్రెండ్ కంటిన్యూ చేస్తూ గత 24 గంటల్లో కొత్త‌గా 61,537 పాజిటివ్ కేసులు న‌మోదుకాగా 933 మంది మృత్యువాతపడ్డారు.

ఇక ఇప్పటివరకు దేశంలో క‌రోనా కేసుల సంఖ్య 20,88,612కు చేరగా 6,19,088 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 14,27,006 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకోగా 42,518 మంది మృత్యువాతపడ్డారు.

ఇప్పటివరకు 2,33,87,171 మందికి కరోనా టెస్టులు నిర్వహించామని నిన్న ఒకేరోజు దేశంలో 5,98,778 మందికి క‌రోనా ప‌రీక్షలు నిర్వ‌హించామ‌ని ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ మెడిక‌ల్ రిసెర్చ్ (ఐసీఎమ్మార్‌) తెలిపింది.

- Advertisement -