తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ మరోసారి భేటీ కానున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల సమస్యలు, ఫిర్యాదులపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. వీడిమో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించే ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ఇరు రాష్ట్రాల సీఎస్‌లకు కేంద్ర జల్ శక్తి కార్యదర్శి యూపీ సింగ్ కోరారు.
నాలుగు ప్రధాన అంశాలు ఏజెండా సమావేశం జరగనుంది. కృష్ణాబోర్డు, గోదావరి బోర్డు పరిధులను నిర్ణయించడం, అపెక్స్ కౌన్సిల్ పరిశీలన, ఆమోదం కోసం కృష్ణా, గోదావరి బోర్డులకు కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లను అందజేయడం, కృష్ణా, గోదావరి నదీ జలాలను ఇరు రాష్ర్టాల మధ్య పంపిణీ చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేయడం, కృష్ణాబోర్డు ప్రధాన కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్‌కు తరలించడం వంటివి చర్చించనున్నారు.
2016 ఆగస్టులో సీఎం కేసీఆర్, అప్పటి ఏపీ సీఎం చంద్రబాబుతో నాటి కేంద్రమంత్రి ఉమాభారతి నేతృత్వంలో అపెక్స్ సమావేశం జరగ్గా రెండోసారి అపెక్స్ కమిటీ సమావేశం జరగనుంది.