కే‌సి‌ఆర్ తో జగన్ భేటీ.. రాజకీయమెందుకు ?

33
- Advertisement -

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బి‌ఆర్‌ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రితో రేపు భేటీ కానున్నారు. హైదరబాద్ లోని జూబ్లీహిల్స్ కే‌సి‌ఆర్ స్వగృహంలో ఈ భేటీ జరగనునట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే హాట్ టాపిక్ గా నిలుస్తోంది. ఆ మద్య కే‌సి‌ఆర్ తుంటి ఎముక ఇరిగిన కారణంగా యశోధ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ టైమ్ లో రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు ఆయనను పరామర్శించారు. ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున.. ఇలా చాలామందే భేటీ అవుతూ వచ్చారు. కానీ ఏపీ సి‌ఎం జగన్ మాత్రం ఆ టైమ్ లో ఎలాంటి భేటీ కాలేదు. కే‌సి‌ఆర్ గురించి ఎక్కడ ప్రస్తావించలేదు. .

దీంతో వైఎస్ జగన్ పై కొంత విమర్శలు వ్యక్తమౌతు వచ్చాయి. అయితే తాజాగా కే‌సి‌ఆర్ ను పరామర్శించేందుకు జగన్ సిద్దమవ్వడంతో ఈ భేటీ వెనుక రాజకీయ వ్యూహం ఉందనేది కొందరు చెబుతున్నా మాట. ఎందుకంటే మరో మూడు నెలల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పైగా ఈసారి జగన్మోహన్ రెడ్డికి ఇతర పార్టీల నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి తోడు ఏపీ రాజకీయాల్లోకి కాంగ్రెస్ తరఫున షర్మిల కూడా ఎంట్రీ ఇవ్వనున్నారనే ప్రచారం జరుగుతున్న వేళ కే‌సి‌ఆర్ మద్దతు కోసమే జగన్ భేటీ అవుతున్నారనే వాదన కూడా ఓవైపు వినిపిస్తోంది. అయితే ఈ భేటీ వెనుక ఎలాంటి రాజకీయ ప్రణాళికలు లేవని, కేవలం కే‌సి‌ఆర్ ను పరామర్శించేందుకే జగన్ భేటీ కానున్నారని వైసీపీ వర్గం నుంచి వినిపిస్తున్న మాట. మరి ఈ భేటీతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకొనున్నాయో చూడాలి.

Also Read:తెలంగాణలో అమర్ రాజా భారీ పెట్టుబడులు

- Advertisement -