- Advertisement -
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 15 లక్షలు దాటాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 48,513 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 15,31,669కి చేరాయి.
ప్రస్తుతం 5,09,447 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 9,88,029 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 34,193 మందిచెందగా 24 గంటల్లో 768 మంది చనిపోయారు.
దేశంలో కరోనా రికవరీ రేటు 65 శాతంగా ఉండగా ఇప్పటివరకు 1,77,43,740 టెస్టులు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. నిన్న ఒక్కరోజే 4,08,855 టెస్టులు నిర్వహించగా అత్యధిక కేసులున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి.
- Advertisement -