రాష్ట్రంలో 24 గంటల్లో 1640 కరోనా కేసులు..

184
corona
- Advertisement -

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 53 వేలకు చేరువయ్యాయి. గత 24 గంటల్లో1,640 పాజిటివ్ కేసులు న‌మోదుకాగా 8 మంది మృతిచెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది.

దీంతో ఇప్పటివరకు తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 52,466కి చేరుకోగా ఇప్పటివరకు 455 మంది మృతిచెందారు. రాష్ట్రంలో 11,677 యాక్టివ్ కేసులు ఉండ‌గా.. 40,334 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకుని ఢిశ్చార్జ్ అయ్యారు.

గ‌త 24 గంట‌ల్లో రాష్ట్రవ్యాప్తంగా 15,445 శాంపిల్స్‌ను టెస్ట్ చేసిన‌ట్టు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. జీహెచ్ఎంసీ ప‌రిధిలో 683 కేసులు న‌మోదు కాగా మిగతా జిల్లాల్లో వెయ్యికి పైగా కేసులు న‌మోదు అయ్యాయి.

- Advertisement -