12 లక్షలు దాటిన కరోనా కేసులు..

189
corona
- Advertisement -

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 12 లక్షలు దాటింది. గత 24 గంట‌ల్లో రికార్డు స్ధాయిలో 45,720 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 1129 మంది మృత్యువాతపడ్డారు.

దీంతో దేశంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 12,38,635కు చేరింది. కరోనాతో ఇప్పటివరకు 29,681 మంది మృత్యువాతపడగా ప్రస్తుతం దేశంలో 4 లక్షల 26 వేల 167 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా మహమ్మారి నుండి 7,82,606 మంది బాధితులు కోలుకున్నారు.

దేశంలో ఇప్పటివరకు 1,50,75,369 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వహించామని…నిన్న ఒకేరోజు 3,50,823 కరనా టెస్టులు చేశామని తెలిపింది ఐసీఎంఆర్‌.

- Advertisement -