ఆధునిక వ్యవసాయాన్ని అభివృద్ధి చేసేందుకే రాష్ట్రంలో రైతు వేదిక నిర్మాణాలు, నూతన గోదాముల నిర్మాణాలకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని ఉప్పునుంతల మండలం దేవదారి కుంటలో, అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ లో నూతనంగా నిర్మించిన రెండు గోదాములను మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు.
పలు గ్రామాలలో నిర్మించనున్న రైతు వేదిక నిర్మాణాల శిలాఫలకాలకు మంత్రి శంకుస్థాపనలు చేశారు.అనంతరం అంగిరేకుల శేకరయ్య ఫంక్షన్ హాల్ లో జిబీఆర్ ట్రస్ట్ ,గుడ్ల ధనలక్ష్మి ట్రస్ట్ లు సంయుక్తంగా సమకూర్చిన నిత్యావసర సరుకులు నియోజకవర్గ ప్రైవేట్ ఆద్యాపకులకు మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఓ గువ్వల బాలరాజు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కలెక్టర్ శర్మన్ పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.