మా పెళ్లికి రండి: సీఎం కేసీఆర్‌కు నితిన్ ఆహ్వానం

221
nithin
- Advertisement -

జూలై 26న హైద‌రాబాద్‌ పలక్‌నుమా ప్యాలెస్‌లో హీరో నితిన్ వివాహం నిరాడంబరంగా జరగనున్న సంగతి తెలిసిందే. రాత్రి 8:30 గంట‌ల‌కు షాలిని మెడ‌లో మూడు ముళ్లు వేయ‌నున్నారు. ప్ర‌భుత్వ నియ‌మ నిబంధ‌న‌ల‌ను అనుస‌రిస్తూ, త‌గిన జాగ్ర‌త్త‌లు పాటిస్తూ వివాహ వేడుక‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఈ వేడుక‌కు కేవ‌లం ఇరు కుటుంబాల‌వారు, స‌న్నిహిత స్నేహితులు హాజ‌ర‌వ‌నున్నారు.

ఈ నేపథ్యంలో ఇవాళ ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ని కలిశారు నితిన్. తన వివాహానికి సంబంధించిన ఆహ్వానపత్రికను అందజేసి పెళ్లికి రావాల్సిందిగా కోరారు.

ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో నితిన్‌, షాలిని ప‌సుపు కుంకుమ వేడుక జ‌రిగిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం నితిన్ ‘రంగ్ దే’, ‘చెక్’ అనే రెండు సినిమాలు చేస్తున్నారు. ఆ త‌ర్వాత మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో ‘అంధాధున్’ రీమేక్‌, కృష్ణ‌చైత‌న్య ద‌ర్శ‌క‌త్వంలో ‘ప‌వ‌ర్ పేట’ సినిమాలు చేయ‌నున్నారు.

- Advertisement -