నితిన్ పెళ్లి డేట్ ఫిక్స్‌..!

72
nithin

హీరో నితిన్ పెళ్లి డేట్ ఫిక్స్ అయిందా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నెల 26న నితిన్ పెళ్లి వేడుక నిరాడంబరంగా హైదరాబాద్‌లో జరగనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన పనులను నితిన్ తండ్రి, నిర్మాత సుధాకర్ రెడ్డి చూసుకుంటున్నారట.

ప్రస్తుతం ఈ వార్త టీ టౌన్‌లో హాట్ టాపిక్‌గా మారగా అతికొద్దిమంది అతిథుల సమక్షంలో నితిన్ పెళ్లి జరగనుందట. ఈ ఏడాది ఫిబ్రవరిలో షాలినితో నితిన్ ఎంగేజ్ మెంట్ జరిగిన సంగతి తెలిసిందే.

తొలుత దుబాయ్‌లో నితిన్ పెళ్లిని జరపాలనుకున్నారు. కానీ కరనో కారణంగా దుబాయ్ వెళ్లే పరిస్ధితి లేకపోవడంతో హైదరాబాద్‌లోనే జరిపేందుకు పెద్దలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఆగస్టులో రానా పెళ్లి కూడా జరగనున్న సంగతి తెలిసిందే.