తెలంగాణ మిషన్ భగీరథ భేష్..: మనోజ్ కుమార్

381
jal jeevan mission
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం ద్వారా మంచినీటి సరఫరా నిర్వహణలో అవలంబిస్తున్న విధానం దేశంలోని మిగతా అన్ని రాష్ట్రాలకు మార్గదర్శనంగా నిలుస్తోందని జాతీయ జల్ జీవన్ మిషన్ డైరక్టర్ మనోజ్ కుమార్ సాహు అన్నారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు లేఖ ద్వారా తన సందేశాన్ని పంపారు.

తెలంగాణ ప్రభుత్వం మంచినీటి సరఫరాలో అనుసరిస్తున్న అత్యున్నత సాంకేతిక విధానం ద్వారా నీటి వృధాను అరికట్టి, అవసరమైన మేరకే నీటిని సరఫరా చేయవచ్చునని ఆయన అన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా నీటి సరఫరా నిర్వహణలో ఫ్లో కంట్రోల్ వాల్వ్ సాంకేతికను ఉపయోగించాలని ఆయన సూచించారు. ఆ యా రాష్ట్రాలు అధ్యయనానికి టెక్నికల్ టీమ్ లను తెలంగాణ రాష్ట్రానికి పంపి మంచినీటి సరఫరాలో తెలంగాణ మోడల్ ను అనుసరించాలని చెప్పారు.

- Advertisement -