యుఎస్‌లో కరోనా ఉగ్రరూపం…రోజుకు 60 వేల కేసులు

169
america
- Advertisement -

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా…అమెరికాపై పంజా విసురుతూనే ఉంది. ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసుల్లో అమెరికా అగ్రస్ధానంలో ఉండగా ప్రస్తుతం రోజుకు 60 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.

గత 24 గంట‌ల్లో దేశంలో రికార్డుస్థాయిలో 67,632 కేసులు నమోదుకాగా మొత్తం 36,16,747కు చేరాయి కరోనా పాజిటివ్ కేసులు. ఇక కరోనాతో అమెరికాలో ఇప్పటివరకు 1,40,140 మంది చెందగా 18,30,645 మంది చికిత్స పొందుతున్నారు.

కరోనా మహమ్మారి నుండి 16,45,962 కోలుకున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా కోటి 36 లక్షల 91 వేల 570 పాజిటివ్ కేసులు నమోదుకాగా 5 లక్షల 86 వేల 820 మంది మృత్యువాతపడ్డారు.

- Advertisement -