యుఎస్‌లో 5 లక్షలకు చేరిన కరోనా మృతులు…

72
covid

కరోనా పెను భూతానికి అమెరికా విలవిలలాడిపోతోంది. ఇప్పటివరకు అమెరికాలో కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 5 లక్షలకు చేరువయ్యాయి. అమెరికాలో గతేడాది ఫిబ్రవరిలో తొలి కరోనా మరణం న‌మోదైంది. అప్ప‌టి నుంచి తొలి నాలుగు నెల‌ల్లో అంటే మే నెల చివ‌రిక‌ల్లా అమెరికాలో క‌రోనా మృతుల సంఖ్య లక్ష మార్కును దాటింది.

తర్వాత సెప్టెంబర్‌లో 2 లక్షల మార్క‌ను, డిసెంబర్‌లో 3 లక్షల మార్కును చేరాయి. ట్రంప్‌ అధ్యక్ష పదవి నుంచి వైదొలిగే స‌మ‌యానికి కరోనా మృతులు 4 లక్షలు దాటగా ఫిబ్ర‌వ‌రి 21 నాటికి 4.98 ల‌క్ష‌ల క‌రోనా మ‌ర‌ణాలు రికార్డ‌య్యాయి.

అమెరికాలో ఇప్పటివరకు క‌రోనా మ‌హ‌మ్మారి బారిన‌ప‌డిన వారి సంఖ్య 2.80 కోట్లకు చేరగా, ప్రపంచవ్యాప్తంగా కరోనా బారినప‌డి మ‌ర‌ణించిన వారి సంఖ్య 25 ల‌క్ష‌లు దాటింది. దాదాపు 102 ఏండ్ల క్రితం ఇన్‌ఫ్లూయెంజా వైర‌స్‌ సృష్టించిన విలయం తర్వాత అగ్ర‌రాజ్యంలో అంతటి భారీ సంక్షోభం ఇదే.