ఏపీలో 22259కి చేరిన కరోనా కేసులు..

213
coronavirus
- Advertisement -

ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో 27,643 మందికి పరీక్షలు నిర్వహించగా 1051 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఏపీకి చెందిన వారు 1062 మంది ఉండగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 9 మంది ఉన్నారు.

ఇక ఏపీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 22259కు చేరింది. ఇక మొత్తం మరణాల సంఖ్య 264కి చేరగా ప్రస్తుతం ఏపీలో 10894 యాక్టివ్ కేసులున్నాయి. ఏపీలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో మొత్తం 2722 పాజిటివ్ కేసులు నమోదుకాగా అనంతపురం జిల్లాలో కేసులు 2568, గుంటూరు జిల్లాలో 2435 కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 258, గుంటూరు జిల్లాలో 173, తూర్పుగోదావరి జిల్లాలో 125, అనంతపురం జిల్లాలో 87, కడప జిల్లాలో 71, కృష్ణా జిల్లాలో 70, నెల్లూరు జిల్లాలో 63, కర్నూలు జిల్లాలో 51, పశ్చిమగోదావరి జిల్లాలో 47, విజయనగరం జిల్లాలో 38, విశాఖపట్నం జిల్లాలో 38,శ్రీకాకుళం జిల్లాలో 31, ప్రకాశం జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి.

- Advertisement -