దేశంలో కరోనా మహమ్మారి పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి వేల సంఖ్యలో నమోదవుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు దేశంలో కరోనా టెస్టుల సంఖ్య కోటి దాటింది. 1, 02, 11, 902 టెస్టులు చేసినట్లు వెల్లడించిన ఐసీఎంఆర్ వెల్లడించింది. గత 24 గంటల్లో 2, 41, 430 నమూనాలను పరీక్షించినట్లు తెలిపింది.
ఇక కరోనా పాజిటివ్ కేసుల విషయానికొస్తే కేసుల సంఖ్య ఏడు లక్షలు దాటగా 24 గంటల్లో కొత్తగా 22,252 కేసులు నమోదు అయ్యాయి. 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా 467 మంది మరణించారు.
7,19,665 కేసులు నమోదుకాగా 2,59,557 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. 4,39,948 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 20,160గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
ప్రపంచంలో కరోనా పాజిటివ్ కేసులు వచ్చిన దేశాల్లో భారత్ మూడో స్దానంలో నిలవగా వైరస్ మరణాల్లో భారత్ 8వ స్థానంలో ఉన్నది. ఢిల్లీలో ప్రస్తుతం పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష దాటింది.