ఐసీసీ ఛైర్మన్‌గా శశాంక్ మనోహర్ రాజీనామాతో కొత్త ఛైర్మన్‌గా ఎవరు ఎన్నికవుతారనే దానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఛైర్మన్ రేసులో బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ,ఈసీబీ మాజీ ఛైర్మన్ కొలిన్ గ్రేవ్స్ ఉండగా దాదాకే ఎక్కువమంది మద్దతు తెలిపే అవకాశం ఉంది. ఇప్పటికే పలు దేశాల మాజీ కెప్టెన్లు ఐసీసీ ఛైర్మన్‌గా గంగూలీకి బహిరంగంగానే తమ మద్దతు ప్రకటించారు.
కొత్త చైర్మన్‌ను ఎన్నుకునే వరకు వైస్ చైర్మన్‌గా ఉన్న ఇమ్రాన్ ఖవాజా (హాంకాంగ్) తాత్కాలిక చైర్మన్‌గా కొనసాగుతారని ఐసీసీ పేర్కొంది. వచ్చే వారం జరిగే బోర్డు సమావేశంలో కొత్త చైర్మన్ ఎన్నిక ప్రక్రియకు సంబంధించి ఆమోదం తెలపనున్నారు.
అయితే, బీసీసీఐ, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ లలో కార్యవర్గ సభ్యుడిగా గంగూలీ పదవీ కాలం ఈ నెల 31తో ఆరేళ్లు పూర్తవుతుంది. జస్టిస్ లోధా కమిటీ సిఫార్సుల ప్రకారం మరో పదవి చేపట్టాలంటే కనీసం మూడేళ్ల విరామం ఉండాలి. దీంతో దాదా సుప్రీంను ఆశ్రయించారు. సుప్రీం తీర్పు ఎలా వస్తుందోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది.