భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ నేతృత్వంలోని కేంద్ర బృందం గచ్చిబౌలీలోని తెలంగాణ ఇనిస్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS),గాంధీ ఆసుపత్రి, దోమల్ గూడాలోని దోభీ గల్లీ (కంటేన్ మెంట్ ఏరియాను) సందర్శించి క్షేత్ర స్థాయిలో పరిస్థితులను పరీశిలించారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్,సీనియర్ ఆధికారులతో సమావేశమై కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు తీసుకోవాలసిన చర్యల పై విస్తృతంగా చర్చించారు.
రాష్ట్రంలో కోవిడ్ మేనేజ్మెంట్‌పై వైద్య శాఖ అధికారులు డిటేల్డ్ ప్రజెంటేషన్‌ను ఇచ్చారు. రాష్ట్రంలో సర్వైలెన్స్ , కంటేన్ మెంట్ చర్యలు, ఆసుపత్రుల సన్నద్దత, వైద్య సంరక్షణ పరికరాల సమీకరణ, వైరస్ నివారణ చర్యలపై కేంద్ర బృందానికి వివరించారు. రాష్ట్రంలో 17081 బెడ్లు ఉన్నాయని, మరింత మెరుగైన చికిత్స కోసం 4489 అదనపు సిబ్బందిని రిక్రూట్ చేసామని తెలిపారు. వైద్య మౌలిక సదుపాయలు మెరుగుపరచడం కోసం రూ.475.74 కోట్లు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.
కేంద్ర బృందం రాష్ట్రంలోని ఆసుపత్రుల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేసింది. అలాగే ఇతర రాష్ట్రాల క్షేత్ర స్థాయి పర్యటనల అనుభవాన్ని పంచుకుంది. కేంద్ర బృందం రాష్ట్రంలో కరోనా నియత్రణ చర్యలు , వైద్య పరీక్షల సామర్ధ్యం పెంచడం, కాంటాక్ట్ ట్రేసింగ్ మరియు క్లినికల్ మెనేజ్మెంట్‌పై సూచనలు చేసింది. కేసులు పెరుగుతున్న నేపధ్యంలో వచ్చే రెండు నెలలో చేపట్టవలసిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలన్నారు.
ఈ సమావేశంలో అరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్, కేంద్ర టీం సభ్యులు సంజయ్ జాజు, లవ్ అగర్వాల్, డా. రవీంద్రన్, అరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ డా. యోగితా రాణా, జి.హెచ్.యం.సి కమీషనర్ లోకేష్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్, మేడ్చల్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.