అమెరికాలో పీవీ శతజయంతి ఉత్సవాలు..

216
pv narasimha rao

మాజీ ప్రధాని పి.వి.నరసింహరావు శతజయంతి సందర్బంగా అమెరికాలోని బోస్టన్ నగరంలో పలువురు ఎన్నారైలు నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా టీఆర్‌ఎస్‌ అమెరికా విభాగం కార్యదర్శి అరవింద్ తక్కళ్లపల్లి మాట్లాడుతూ.. కెసిఆర్‌కు పి.వి శతజయంతి ఉత్సవాలను ప్రారంభించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పి.విని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని, 1984లో అమెరికా నుండి కంప్యూటర్ తెప్పించుకొని కోబాల్, మెయిన్ ఫ్రేమ్స్ బేసిక్స్ లాంటి ప్రోగ్రామింగ్ భాషలు 15 రోజుల్లో నేర్చుకున్నారు అని అన్నారు.

పి.విని ఆదర్శంగా తీసుకొని నేటి తరం నాయకులు రాజకీయాల్లో రాణించి ప్రజలకు సేవలందించాలని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పేదవాడు ఆత్మగౌరవంతో భూమి దున్నాలని నాడు పి.వి. భూసంస్కరలను చేపట్టారు అని అన్నారు. బహుభాషా కోవిదుడు, రాజనీతజ్ఞుడు, ఆర్ధిక సంస్కరణలకు నాంది పలికిన దార్శనికుడిని భారత రత్న ఇచ్చి గౌరవించుకోవాలని అని అన్నారు. కార్యక్రమంలో మధు పిన్నింటి, స్నిగ్ధ చెలిమెడ, ప్రణవ్, శృతి, దీపా, దేవా తదితరులు పాల్గొన్నారు.