ఈనెల 25న గురువారం నాడు సనత్ నగర్ నియోజకవర్గంలో 6వ విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు మంత్రి కేటీఆర్. ఉదయం 9.00 గంటలకు బన్సీలాల్ పేట డివిజన్ లోని బోయగూడ లో నూతనంగా ఏర్పాటు చేసిన పార్క్ ను పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రితో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. అనంతరం పార్క్ లో మొక్కలు నాటనున్నారు. అదేవిధంగా ఉదయం 10గంటలకు సనత్ నగర్ డివిజన్ పరిధిలోని బల్కంపేట గ్రేవ్ యార్డ్ లో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటనున్నారు.
కాగా ఈనెల 25న 6వ విడత హరితహారం కార్యక్రమం ప్రారంభంకానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. నర్సాపూర్ హైవేపై సీఎం కేసీఆర్ మొక్కలు నాటి ఈకార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గోన్నాలని సూచించారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే తమ నియోజకవర్గాల్లో మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.