తెలంగాణ పురపాలక శాఖ వార్షిక ప్రగతి నివేదిక విడుదల..

235
urban space for Telangana
- Advertisement -

తెలంగాణ పురపాలక శాఖ వార్షిక ప్రగతి నివేదికను పురపాలక శాఖ మంత్రి కె. తారకరామారావు ఈ రోజు ప్రగతి భవన్‌లో విడుదల చేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్, ఇతర విభాగాధిపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత సంవత్సర కాలంగా పురపాలక శాఖ తరఫున చేపట్టిన వివిధ కార్యక్రమాలకు సంబంధించిన పురోగతిని ఈ కార్యక్రమంలో మంత్రి వివరించారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం పట్టణాల రూపురేఖలు మార్చేందుకు ప్రణాళికాబద్ధమైన కార్యక్రమాలను చేపట్టిందని, ముఖ్యంగా నూతన పురపాలక చట్టం ద్వారా పట్టణాలు మార్చాలన్న లక్ష్యంతో ముందుకుపోతుందని తెలిపారు. పట్టణాలు పురోగతి సాధించేందుకు ప్రభుత్వంతో పాటు పౌరుల భాగస్వామ్యాన్ని పెంచేందుకు సైతం ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఈ సందర్భంగా మంత్రి కే. తారకరామారావు అన్నారు. దీర్ఘకాలంలో పట్టణాలన్నింటిని ప్రజలు జీవించేందుకు అనుకూలంగా లివబుల్, లవబుల్ సిటీలుగా మార్చాలన్నా బృహత్తరమైన, దీర్ఘకాలిక లక్ష్యంతో తెలంగాణ పురపాలక శాఖ పని చేస్తున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. పట్టణాల్లో ప్రజలకు అవసరం అయిన ప్రాథమిక సౌకర్యాలపైన ప్రస్తుతం తమ దృష్టి ఉన్నదన్నారు.

తెలంగాణ పురపాలక శాఖ రూపొందించిన ప్రగతి నివేదిక లోని కీలకమైన అంశాలు:

నూతన పురపాలక చట్టం 2019:

రాష్ట్రంలోని పురపాలికల్లో సమగ్రమైన మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ చట్టాన్ని రూపొందించింది. ఇది జిహెచ్ఎంసి మినహా రాష్ట్రంలోని అన్ని పట్టణ స్థానిక సంస్థలకు వర్తిస్తుంది. ఈ చట్టంతో పట్టణాల్లో నూతన శకం ప్రారంభమైంది అని చెప్పవచ్చు. ఈ చట్టం ప్రకారం స్వీయ ధ్రువీకరణ ద్వారా ఆన్లైన్లో ఆస్తి పన్ను చెల్లింపు మొదలుకొని 100% ఆన్లైన్ బిల్డింగ్ పర్మిషన్ ప్రక్రియ వరకు అనేక విప్లవాత్మకమైన కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ప్రతి పురపాలిక బడ్జెట్ లో పది శాతం హరిత బడ్జెట్ గా ఉంచాలని ఈ చట్టం నిర్దేశిస్తుంది. ప్రతి వార్డు లో నాలుగు వార్డు స్థాయి కమిటీలను 15 మందితో ఏర్పాటు చేయాలని నిర్దేశించింది. తద్వారా పురపాలనలో పౌరుల భాగసామ్యన్ని పెంచేలా చర్యలుతీసుకున్నది.

నూతన పురపాలికల ఏర్పాటు:

తెలంగాణలో పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా పరిపాలనను మరింతగా వికేంద్రీకరించే లక్ష్యంతో రాష్ట్రంలో అనేక నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది. పాత మునిసిపాలిటీలతోపాటు, నూతన కార్పోరేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గతంలో ఉన్న 78 స్థానిక సంస్థల సంఖ్యను 139 పెంచడం జరిగింది. ఇందులో 13 నూతన మున్సిపల్ కార్పొరేషన్ లు కూడా ఉన్నాయి. నూతనంగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్లతో పాటు అన్ని మున్సిపాలీటీలకు 2020 జనవరిలో పురపాలక ఎన్నికలు విజయవంతంగా నిర్వహించడం జరిగింది.

పురపాలక పట్టణాలకు ప్రత్యేక నిధుల అండ:

నూతనంగా ఏర్పాటుచేసిన పురపాలక పట్టణాలతోపాటు గతంలో ఉన్న పట్టణ స్థానిక సంస్థలను అన్ని విధాలా ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు అందించడం జరిగింది. ముఖ్యంగా టియూయప్ ఐడిసి సంస్థ ద్వారా 110 పట్టణ స్థానిక సంస్థల్లో సుమారు రెండు వేల కోట్ల రూపాయల విలువైన పనులకు పరిపాలన పరమైన అనుమతులు ఇవ్వడం జరిగింది. చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున పట్టణాలకు ప్రత్యేక నిధులు ఇవ్వడం మొదటిసారి. ఈ నిధులను నేరుగా అభివృద్ధి కార్యక్రమాలపై ఉపయోగించాలని పురపాలక శాఖ నిర్దేశించడం జరిగింది. తద్వారా పట్టణాల్లో స్పష్టమైన మార్పు కనిపించేలా చర్యలు తీసుకున్నది

పట్టణ రోడ్లకు మహర్దశ:

పురపాలక శాఖ తన పరిధిలోని పట్టణాల్లో రోడ్లకు ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు చేపట్టింది. టి యు ఎఫ్ ఐ డి సి ద్వారా ఇచ్చిన ప్రత్యేక నిధులను ప్రతి పట్టణంలో ప్రధాన రోడ్లపైన ఖర్చు చేసేలా ఇంజనీరింగ్ శాఖ ద్వారా చర్యలు చేపట్టింది. కనీసం పట్టణానికి ఒక్క ప్రధాన రోడ్డుని అయినా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని సూచించింది. పురపాలక శాఖా హైదరాబాద్ నగరంలో రోడ్ల నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. దీంతో సి ఆర్ ఎం పి, ఎస్ ఆర్ డి పి వంటి రోడ్డు నిర్వహణ ప్రాజెక్టులను వేగంగా ముందుకు తీసుకుయింది. మొదటిసారిగా రోడ్ల నిర్వహణలో మంచి పేరున్న పెద్ద కంపెనీలకు రోడ్ ల నిర్వహాణనను అప్పజెప్పింది. ఈ విధంగా హైదరాబాద్ నగరంలో ఆరు వందల తొంభై కిలోమీటర్ల మేర రోడ్లను ఆరు ప్రధాన ఏజెన్సీలకు నిర్వహణ అప్పజెప్పింది. ఇంత పెద్ద ఎత్తున దీర్ఘకాలిక నిర్వహణను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పజెప్పడం దేశంలోనే మొదటి సారి. దీనికి సంబంధించిన ఫలితాలు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది. దీంతోపాటు నగరంలో ప్రధానమైన మార్గాన్ని రద్దీ రహితంగా మార్చేందుకు మిస్సింగ్ రోడ్లు, స్లిప్ రోడ్లు, లింకు రోడ్ల అభివృద్ధి చేపట్టడం జరిగింది. 38 ప్రధాన రోడ్డు విస్తరణ పనులు జంక్షన్ల అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. దీంతోపాటు multi-level ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రణాళికలు మొదలుపెట్టింది .

టీఎస్ బి పాస్:

ప్రస్తుతం హైదరాబాద్ జిహెచ్ఎంసి మరియు హెచ్ఎండిఏ లాంటి చోట్ల dpms విధానంలో ఇస్తున్న బిల్డింగ్ అనుమతుల ప్రక్రియను మరింత సరళతరం చేసేందుకు పురపాలక శాక ప్రయత్నాలు ప్రారంభించింది. రాష్ట్రంలోని అన్ని పురపాలక పట్టణాల్లో ఆన్లైన్ ద్వారా బిల్డింగ్ అందించే ప్రక్రియ అనుమతులు అందించే ప్రక్రియ తెలంగాణ పురపాలక శాఖ ప్రారంభించింది. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా కొనసాగుతున్న ఈ ప్రక్రియ క్యాబినెట్ తుది ఆమోదం తర్వాత పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తుందని పురపాలక శాఖ తెలిపింది

టీడీఆర్ పాలసీ:

టిడిఆర్ పాలసీకి ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా జీహెచ్ఎంసీలోని రోడ్డు విస్తరణ మరియు ఇతర అభివృద్ధి పనులకు కావలసిన ఆస్దుల సేకరణ మరింత తేలిక అయింది. ఈ కార్యక్రమం వలన స్థానిక సంస్థల పైన ఆర్థిక భారం పడకపోవడంతో ఆస్తుల సేకరణ మరింత సులభం అయింది. ఇప్పటిదాకా 2019- 20 సంవత్సరానికి 250 కోట్ల విలువైన టిడిఅర్ సర్టిఫికెట్ల అమ్మకం జరిగింది. పౌరులు తాము తీసుకున్న సర్టిఫికెట్ల కొనుగోలుకు సంబంధించి ఒక టిడిఆర్ ఆన్లైన్ బ్యాంకును పురపాలక శాఖ ఏర్పాటు చేసింది

మెట్రో రైలు ప్రాజెక్టు పూర్తి:

ప్రపంచంలోనే పొడవైన పీపీపి మెట్రో రైల్ ప్రాజెక్ట్ 69 కిలోమీటర్ల మేర పూర్తి అయింది. హైదరాబాద్ మెట్రో ఢిల్లీ తర్వాత రెండో స్థానంలో అతి పొడవైన మెట్రో రైల్ నెట్వర్క్ గా రూపొందింది. 2020 ఫిబ్రవరి నాటికి సుమారు 4 లక్షల మంది రోజువారీగా ప్రయాణం చేస్తూ రద్దీ అయినా మెట్రోల్లో ఒకటిగా నిలిచింది

పట్టణ పేదలకు బస్తీ దవాఖానా భరోసా:

పట్టణ పేదలకు బస్తి దావఖానాల ద్వారా ఆరోగ్యాన్ని అందించేందుకు పురపాలక శాఖ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటిదాకా ఉన్న 123 బస్తీదవాఖాణాలకు మరో 45 దవాఖానాలను ఒకేరోజు ప్రారంబించింది. రానున్న సంవత్సర కాలంలో మొత్తం 350 బస్తీ దవాఖానాలను తెరిచేందుకు పురపాలక శాఖ ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

పట్టణ ప్రజల దాహార్తి తీర్చిన పురపాలక శాఖ:

పట్టణాల్లో తాగునీటికి ఆటంకాలు లేకుండా మంచినీటి సరఫరా చేసినట్టు పురపాలక శాఖ తన నివేదికలో పేర్కొంది. ముఖ్యంగా గత ఏడాది వేసవి కాలానికి సంబంధించి ప్రజల దాహార్తిని తీర్చేందుకు పురపాలక శాఖ ప్రత్యేక కార్యక్రమాలు తీసుకున్నదని, అందుకే రాష్ట్రవ్యాప్తంగా పట్టణాల్లో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు తాగునీరు అందిందని తెలిపింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి సంబంధించి జలమండలి ఆధ్వర్యంలో సుమారు రెండు లక్షల గృహాలకు నీటి సరఫరా చేస్తుందని తెలిపింది. ఇదే జలమండలి 24 పట్టణ స్థానిక సంస్థలను, పద్దెనిమిది గ్రామపంచాయతీలను అనుసంధానం చేస్తూ ఔటర్ రింగ్ రోడ్ లోపల 725 కోట్ల రూపాయలతో తాగునీటి సరఫరా ఈ ప్రాజెక్టును పూర్తి చేసింది. త్వరలోనే హైదరాబాద్కి పూర్తిస్థాయి సాగునీటి భరోసా కల్పించే 20 టీఎంసీల కేశవపురం రిజర్వాయర్ ప్రాజెక్టు నిర్మాణా ప్రణాళికలను వేగవంతం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పురపాలికల్లో అర్భన్ మిషన్ భగీరధ కార్యక్రమాలు జోరుగా కోనసాగుతున్నాయి.

డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్:

డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ద్వారా హైదరాబాద్ నగరంలో ప్రత్యేకంగా కోవిడ్ సంక్షోభం సందర్భంగా మొత్తం పారిశుద్ధ్య కార్యక్రమాలను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పూర్తి చేసింది. తన సిబ్బందికి ప్రత్యేకమైన శిక్షణ తోపాటు, ప్రత్యేకమైన వాహనాలను సమకూర్చుకున్న జిహెచ్ఎంసి డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ దేశంలోనే అత్యుత్తమ ప్రమాణాలను నెలకొల్పింది. ఈ సందర్భంగా ఈ విభాగం చేపట్టిన కార్యక్రమాలకు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభించాయి. పుట్ పాత్ అక్రమణల ఆక్రమణల తొలగింపు, పార్కులను తిరిగి స్వాధీనం చేసుకోవడం, చెరువుల కాపాడుకోవడం వంటి అనేక కార్యక్రమాలను రెస్పాన్స్ ఫోర్స్ పెద్దఎత్తున చేపట్టింది

కరోనా కట్టడిలో పురపాలక శాఖ పాత్ర:

కరోనా సంక్షోభం నేపథ్యంలో పురపాలక శాఖ దాని కట్టడి కోసం కీలకమైన చర్యలు తీసుకుంది. లాక్ డౌన్ మొదలైన నాటి నుంచి మున్సిపల్ విభాగం పారిశుద్ధ్యం, విపత్తు సహాయక నిర్వహణ, నీటి సరఫరా వంటి అంశాల విషయంలో 24 గంటల పాటు ప్రణాళికాబద్ధంగా పని చేసింది. దీంతో పాటు సుమారు లక్షా 25 వేల మందికి ఉచిత భోజనాన్ని అందించింది. ముఖ్యంగా వలస కార్మికులకు సంబంధించి వారి వారి సొంత గ్రామాలకు వెళ్లేందుకు ఇతర శాఖలతో పురపాలక శాఖ సమన్వయం చేసుకొని పని చేసింది. వలస కార్మికుల క్యాంపుల్లో కావాల్సిన కనీస వసతుల నిర్వహణకు సైతం దోహదం చేసింది. మరోవైపు ఈ సంక్షోభాన్ని అవకాశంగా వాడుకున్న పురపాలక శాఖ హైదరాబాద్ లాంటి పట్టణాల్లో రోడ్లు, ఫ్లైఓవర్ల నిర్మాణం వంటి ఇంజనీరింగ్ పనులను వేగంగా పూర్తి చేసింది. 60 రోజుల లాక్ డౌన్ కాలంలో సుమారు రెండు వేల కోట్ల రూపాయల విలువైన ఇంజనీరింగ్ పూర్తి చేసింది.

- Advertisement -