దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు కరోనా నియంత్రణకు తగు చర్యలు తీసుకుంటున్నాయి. ఇక ఇప్పటివరకూ కరోనాతో ఒక్కరు కూడా మృతి చెందని గోవాలో మొదటిసారి ఓ కరోనా మరణం సంభవించింది. గోవాలో ప్రస్తుతం 754 పాజిటివ్ కేసులు ఉన్నాయి. వాటిలో 129 మంది రికవరీ అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల రేటు 9 శాతంగా ఉండగా ఇండియాలో అది 3.2 శాతంగా ఉంది.
గత 24 గంటల్లో కొత్తగా మరో 14821 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 425282 కు చేరింది. నిన్న ఒక్క రోజే 445 మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 13699కి పెరిగింది. అయితే రికవరీల రేటు కాస్త పెరిగింది. తాజాగా 9440 మంది రికవరీ అవ్వడంతో మొత్తం రికవరీ కేసుల సంఖ్య 237195గా మారింది. ప్రస్తుతం రికవరీ రేటు 55.8 శాతంగా ఉంది. రెండు వారాలుగా ఈ రేటు పెరుగుతూ ఉండటం కాస్త ఊరటను ఇస్తోంది. దేశంలో ప్రస్తుతం 174387 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం కరోనా పాజిటివ్ కేసుల్లో భారత్ ప్రస్తుతం 4వ స్థానంలో ఉంది.
కరోనా కేసులతో టాప్ 8లో ఉన్న రాష్ట్రలు ఇవే..
1.మహారాష్ట్రలో అత్యధికంగా 132075 పాజిటివ్ కేసులున్నాయి.
2.ఢిల్లీలో 59746 కేసులు.
3.తమిళనాడులో 59377 కేసులు.
4.గుజరాత్‌లో 27260 కేసులు.
5.రాజస్థాన్ 14930 కేసులు.
6.బెంగాల్ 13945 కేసులు.
7.మధ్యప్రదేశ్ 11903 కేసులు.
8.హర్యానా 10635 కేసులు ఉన్నాయి.