ప్రతి ఆదివారం కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి

278
errabelli
- Advertisement -

ఐటీ, పరిశ్రమలు, పుర‌ పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి క‌ల్వ‌కుంట్ల రామారావు ఇచ్చిన పిలుపు మేర‌కు ప్ర‌తి ఆదివారం ప‌ది గంట‌ల‌కు ప‌ది నిమిషాలు కార్య‌క్ర‌మంలో భాగంగా రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి లోని త‌మ నివాసంలో త‌మ సతీమణి శ్రీమతి ఉషా దయాకర్ రావు తో క‌లిసి పారిశుద్ధ్య ప‌నులు చేశారు.

ఇంట్లో మొక్కలకు నీళ్ళు పట్టారు. నీటి నిలువ‌లు లేకుండా చేశారు. నీటి నిలువ‌లున్న‌చోట్ల నీటిని తీసేసి, వాటిని ప‌రిశుభ్ర ప‌ర‌చారు. మూత‌లు ఉండేలా చూశారు. చెత్తా చెదారం తీసేసి దోమ‌లు లేకుండా జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి మాట్లాడుతూ కేటీఆర్ ఇచ్చిన పిలుపుని అందరూ పాటించాలన్నారు.ప్ర‌తి ఆదివారం ప‌ది గంట‌ల‌కు, ప‌ది నిమిషాలు కార్య‌క్ర‌మాన్ని ఒక ఉద్య‌మంగా నిర్వహించాలన్నారు. ఈ సీజన్ లో అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త వహించాలి….ఇప్పటికే… కరోనా వైరస్ తో ప్రపంచం అతలాకుతలం అవుతుందన్నారు.

దోమ‌ల నివార‌ణ‌తో మ‌లేరియా, డెంగీ వంటి అనేక అంటు, సీజనల్ వ్యాధుల‌ను రాకుండా నివారించ‌వ‌చ్చు….ఇంటితోపాటు, ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకోవ‌డం ద్వారా రాష్ట్రాన్ని, దేశాన్ని రోగ ర‌హితంగా ఉంచ‌వ‌చ్చన్నారు. ఇప్ప‌టికే ప్ర‌భుత్వం ప‌చ్చ‌ద‌నం-పరిశుభ్ర‌త‌, ప‌ల్లె ప్ర‌గ‌తి, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి, స్వ‌చ్ఛ హైద‌రాబాద్ వంటి అనేక కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టిందన్నారు.

ఆయా కార్యక్రమాల అమలు వల్ల రాష్ట్రంలో కరోనా అదుపులో ఉందని…ప్ర‌స్తుత ప్ర‌తి ఆదివారం, ప‌ది గంట‌ల‌కు ప‌ది నిమిషాలు కార్యక్ర‌మం కూడా ఇందుకు దోహ‌ద ప‌డుతుందన్నారు. ప్రత్యేక పారిశుద్ధ్యం, ప్రతి రోజూ నిర్వహిస్తున్న పారిశుద్ధ్యం కార్యక్రమాలు కూడా పల్లెలను ప్రశాంతంగా ఉంచుతాయన్నారు.

- Advertisement -