13వ రోజు ఆగని పెట్రో మంట..

449
petrol price
- Advertisement -

దేశంలో పెట్రోల్ ధరలు ఆకాశన్నంటుతున్నాయి. వరుసగా 13వ రోజు పెట్రోల్ ధరలు పెరిగాయి. హైదరాబాద్‌లో శుక్రవారం లీటరు పెట్రోల్ ధర 59 పైసలు పెరుగుదలతో రూ.81.36కు, డీజిల్ ధర 61 పైసలు పెరుగుదలతో రూ.75.31కు చేరింది.

దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్ ధర 56 పైసలు పెరుగుదలతో రూ.78.37కు చేరింది. డీజిల్ ధర కూడా 63 పైసలు పెరుగుదలతో రూ.77.06కు ఎగసింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.19 శాతం పెరుగుదలతో 41.57 డాలర్లకు చేరింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.28 శాతం పెరుగుదలతో 38.97 డాలర్లకు చేరింది.

- Advertisement -