చైనా ఆర్మీదే తప్పు: అమెరికా

246
- Advertisement -

భారత్- చైనా సరిహద్దులో ఇరుదేశాల మధ్య నెలకొన్న ఘర్షణపూరిత వాతావరణంపై స్పందించింది అగ్రరాజ్యం అమెరికా. ఈ ఘర్షణలో చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీదే తప్పని అమెరికా సీనియ‌ర్ నేత, సేనేట‌ర్ మిచ్ మెక్‌క‌న‌ల్ ఆరోపించారు.

గాల్వ‌న్ లోయ‌లో భార‌తీయ సైనికుల‌ను రెచ్చ‌గొట్టింద‌ని ఆరోపించిన మిచ్ కేవ‌లం భారత భూభాగాన్ని అక్ర‌మించాల‌న్న ఉద్దేశంతోనే భార‌తీయ సైన్యాన్ని చైనా ఆర్మీ రెచ్చ‌గొట్టిందన్నారు.రెండు అణ్వాయుధ దేశాలు స‌రిహ‌ద్దుల్లో కొట్టుకున్న తీరును ప్ర‌పంచ దేశాలు గ‌మ‌నించాయ‌ని,ఉద్రిక్త‌త‌లు త‌గ్గాల‌ని కోరుకుంటున్నామ‌ని, శాంతి కాంక్షిస్తున్నామ‌ని మెక్ క‌న‌ల్ తెలిపారు.

కరోనా మ‌హమ్మారిని అడ్డు పెట్టుకుని హాంకాంగ్‌ను ఆధీనంలోకి తీసుకున్న‌ట్లు చైనా క‌మ్యూనిస్టు పార్టీపై ఆయ‌న విమ‌ర్శ‌లు చేశారు. జ‌పాన్ వ‌ద్ద ఉన్న‌ శంక‌కూ దీవుల్లోనూ చైనా త‌న సైన్యాన్ని మోహ‌రిస్తున్న‌ట్లు ఆరోపించారు. చైనా కమ్యూనిస్టు పార్టీని తరిమికొట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు మెక్.

- Advertisement -