మెగా ఫ్యామిలీ నుండి వెండి తెరకు పరిచయమైన బ్యూటి కొణిదెల నిహారిక. జయాపజయాలతో సంబంధం లేకుండా ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్‌లతో కూడా బిజీగా ఉంది. అయితే కొంతకాలంగా నిహారిక పెళ్లిపై వార్తలు వెలువడుతుండగా ఆమె తండ్రి నాగబాబు సైతం త్వరలోనే నిహా పెళ్లి ఉంటుందని తెలిపిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే తన పెళ్లిపై మరింత క్లారిటీ ఇచ్చేసింది నిహారిక. స్టార్ బక్స్ కాఫీ కప్ మీద మిస్ నీహ
అని రాసి ఉండగా.. s కొట్టేసి..Mrs అనే దానిపై రైట్ మార్క్ వేసింది. మళ్లీ ఓ ట్విస్ట్ కూడా చేసింది. మిస్టర్స్ అనే పదం చివర క్వశ్చన్ మార్క్ కూడా పెట్టింది. దాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసి ఉహ్.. వాట్?
అని కామెంట్ చేసింది.
ఈ పోస్టును చూసిన చిరంజీవి కూతుళ్లు సుస్మిత, శ్రీజ వై అంటూ నిహారికను ప్రశ్నించగా ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిహారికకు కొంతమంది నెటిజన్లు విషెస్ చెబుతుండగా మరికొంతమంది ఇదంత కొత్త సినిమా ప్రమోషన్ కోసమేనని కొట్టిపారేస్తున్నారు.మరి నిహా పోస్టుపై క్లారిటీ రావాలంటే అఫిషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సిందే.