3 లక్షల 20 వేలకు చేరిన కరోనా పాజిటివ్ కేసులు..

268
india coronavirus cases
- Advertisement -

దేశంలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. . భారత్‌లో ఇప్పటి వరకు 3,20,922 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. 9195 మంది చనిపోయారు. 1,62,379 మంది ఈ వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

గత 24 గంటల్లో కొత్తగా 11,929 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.ఇక మరోవైపు మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది.

మధ్యస్థ దశలో ఉన్న కొవిడ్‌-19 రోగులకు యాంటీ వైరల్‌ ఔషధం రెమెడెసివిర్‌ను వాడాలని కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం సిఫారసు చేసింది. అయితే, ఇతర వ్యాధులతో బాధపడే వారికి, గర్భిణిలు, 12 ఏండ్ల లోపు పిల్లలకు దీనిని సిఫారసు చేయవద్దని వెల్లడించింది. హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను తొలిదశలోని వైరస్‌ రోగులకు మాత్రమే వాడవచ్చని తీవ్రదశలో ఉన్నవారు వాడకూడదని తెలిపారు.

- Advertisement -