తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌కి కరోనా పాజిటివ్. కంగారు పడకండి ఇది సోషల్ మీడియాలో వస్తున్న రూమర్లు మాత్రమే. ఇటీవల బాలీవుడ్ నటుడు రోహిత్ రాయ్ రజినీకి కరోనా అంటు పోస్ట్ పెట్టడం సంచలనంగా మారింది. తమ అభిమాన హీరో రజినీకాంత్ కరోనా బారిన పడ్డాడా? అని ఉలిక్కిపడ్డారు ఆ పోస్ట్ చూసిన నెటిజన్లు. ఆ తర్వాత అది నిజం కాదని తెలిసి ఊపిరి పీల్చుకున్న రజినీ అభిమానులు. అయితే ఆ పోస్ట్ పెట్టిన యాక్టర్‌పై రజినీ అభిమనులు దుమెత్తిపోస్తున్నారు.. దీంతో ఈ పోస్ట్ పెట్టడానికి కారణం చెబుతూ తన ఉద్దేశాన్ని అర్థం చేసుకోండి అని కోరాడు రోహిత్ రాయ్.
కరోనాకు అందరూ ఒక్కటే.. చేతులు శుభ్రంగా కడుక్కోండి.. జాగ్రత్తగా ఉండండి అంటూ రోహిత్ చెప్పినా.. అవేం చూడకుండా కేవలం రజినీపై వేసిన కామెడీ మాత్రమే చూసారు అభిమానులు. తమ హీరోలకు కరోనా పాజిటివ్ అని పోస్ట్ చేస్తావా అంటూ ఆయన్ని విమర్శిస్తున్నారు. ఇలాంటి పిచ్చి పిచ్చి జోకులు ఇంకోసారి వేస్తే ఇంటికి వచ్చి మరీ తంతామంటూ కొందరు హార్డ్ కోర్డ్ అభిమానులు బాగా హార్డ్‌గానే వార్నింగులు ఇస్తున్నారు. మొత్తానికి రోహిత్ రాయ్ చేసిన పోస్ట్ మాత్రం ప్రస్తుతం సంచలనంగా మారుతుంది.
రోహిత్ రాయ్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పోస్ట్.. కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్‌కి కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ అని వచ్చిందని, ప్రస్తుతం ఆ కరోనా క్వారంటైన్‌లో ఉందని పేర్కొన్నాడు. ఈ పోస్ట్‌కి క్యాప్షన్ పెడుతూ.. ఎక్కువసార్లు చేతులు కడుక్కోవడం, శానిటైజర్స్ ఉపయోగించడం, పారిశుధ్య చర్యలు తీసుకోవడం లాంటివి చేస్తేనే కరోనాని అరికట్టగలం అని తెలిపాడు. మొత్తంగా చూస్తే ఎంత గొప్పవ్యక్తి అయినా కరోనా పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అని, కరోనాను అందరూ సమానమే అనేలా ఈ పోస్ట్ పెట్టాడు రోహిత్ రాయ్.