చెత్త వేస్తే రూ. 500 ఫైన్‌: మంత్రి ఎర్రబెల్లి

304
errabelli dayakar rao
- Advertisement -

సిఎం కెసిఆర్ ఆదేశాల‌తో రాష్ట్రంలో ప్ర‌త్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. రేపటి నుంచి 8వ తేదీ వ‌ర‌కు రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం చేపట్టనున్నట్లు వెల్లడించారు.

ప‌ల్లెల్లో ప్ర‌జ‌ల జీవిత నాణ్య‌త‌, జీవ‌న ప్ర‌మాణాలు పెంచ‌డ‌మే ల‌క్ష్యమని…గ్రామ పంచాయ‌తీల ప‌రిపాల‌నా సామర్థ్యాల‌ను మెరుగుప‌ర్చ‌డ‌మే ధ్యేయం అన్నారు. ప‌ల్లెల్లో ప‌చ్చ‌ద‌నం-ప‌రిశుభ్ర‌త‌తోపాటు సీజ‌న‌ల్ వ్యాధుల నివార‌ణే క‌ర్త‌వ్యం అని మొద‌టి రోజు గ్రామాల్లో పాద‌యాత్ర‌లు…పంచాయ‌తీ స‌మావేశాలు, 8 రోజుల ప్ర‌ణాళికలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

చెత్త వేస్తే రూ.500 జ‌రిమానాలు-పారిశుద్ధ్యం పాటిస్తే, అదుపులో సీజ‌న‌ల్ వ్యాధులు ఉంటాయన్నారు. క‌రోనా నేప‌థ్యంలో మాస్కులు ధ‌రించాలి, సామాజిక‌, భౌతిక దూరాన్ని పాటించాలన్నారు. ప్ర‌త్యేక పారిశుద్ధ్య ల‌క్ష్యాల‌ను తెలుపుతూ, ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యాన్ని పెంచాలన్నారు ఎర్రబెల్లి.

గ్రామాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుతూ, అధికారులు-ప్ర‌జాప్ర‌తినిధుల జ‌బాబుదారిత‌నాన్ని పెంచాలని…హరితహారం కార్యక్రమం కోసం గ్రామాల్లో నర్సరీ లు ఏర్పాటు చేశాం అన్నారు. పల్లె ప్రగతి తో కరోనా ను కట్టడి చేయవచ్చు,ఇప్పుడు గ్రామాల్లో వస్తున్న కరోనా కేస్ లు అన్ని ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వలస కార్మికులవే అన్నారు.

అన్ని గ్రామాల్లో వైకుంఠ దామలు ఏర్పటు చేయాలని…ఇంటి చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా చేయకపోతే 500 ఫైన్ వేస్తాం అన్నారు.
సర్పంచ్ బాధ్యత తీసుకోవాలి,పల్లె ప్రగతి కార్యక్రమం సక్రమంగా నిర్వహించకపోతే సర్పంచ్ లపై చర్యలు ఉంటాయన్నారు. మంచి నీటి ట్యాంక్ లను శుభ్రంగా ఉంచాలన్నారు.

- Advertisement -