పవర్ స్టార్ పవన్ కల్యాణ్- హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కిన చిత్రం గబ్బర్ సింగ్. సరిగ్గా 8 సంవత్సరాల క్రితం విడుదలైన ఈ చిత్రం పవన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.
గబ్బర్ సింగ్ విడుదలై 8 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా అభిమానులు సోషల్ మీడియాలో చేసిన హంగామా అంతా ఇంత కాదు. గబ్బర్ సింగ్ మూవీ హ్యాష్ ట్యాగ్ టాప్ ట్రెండింగ్‌లో నిలిచేంతగా వైరల్ చేశారు పవన్ ఫ్యాన్స్.
ఇక దర్శకుడు హరీష్ శంకర్ సైతం ఓ లెటర్‌ని విడుదల చేశారు. ఈ అద్భుతమైన సినిమా నిర్మాణ భాగంలో నాకు తోడ్పడిన టీమ్ రమేష్ రెడ్డి, వేగేశ్న సతీష్‌తో పాటు కొందరి పేర్లు ప్రస్తావిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడే మొదలైంది..మళ్లీ వస్తున్నామని పవన్ తో మూవీపై క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ లేఖలో బండ్ల గణేష్,హీరోయిన్ శృతిహాసన్ పేరు ప్రస్తావించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Thanks again for the overwhelming appreciations and celebrations…. 🙏🙏🙏 thanks to all the fans who made this 🙏🙏🙏🙏🙏 pic.twitter.com/ZVyHrdGASg
— Harish Shankar .S (@harish2you) May 11, 2020