కుంబ్లే ఎవర్‌గ్రీన్ కెప్టెన్: ఆర్పీ సింగ్

290
rp singh anil
- Advertisement -

టీమిండియా మాజీ కెప్టెన్లపై ప్రశంసలు గుప్పించాడు మాజీ పేస్ బౌలర్ ఆర్పీ సింగ్. నలుగురు కెప్టెన్లు గంగూలీ, ద్రావిడ్,కుంబ్లే,ధోని కెప్టెన్సీలలో ఆడిన ఆర్పీ వీరంతా గొప్ప సారధులు అని కొనియాడారు.

అయితే ఈ నలుగురిలో కుంబ్లే ది బెస్ట్..ఎవర్ గ్రీన్ కెప్టెన్ అని ప్రశంసలు గుప్పించాడు ఆర్పీ సింగ్. సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో మ్యాచ్‌లు ఆడిన అనుభ‌వం ఉండ‌టంతో బౌలింగ్‌పై పూర్తి అవ‌గాహ‌న కుంబ్లే సొంత‌మ‌ని ఆర్పీ చెప్పాడు. ఆట‌గాళ్ల‌లో మ‌నో స్థైర్యం ఎలా నింపాలో దాదా కంటే బాగా ఎవ‌రికీ తెలియ‌క‌పోవ‌చ్చ‌ని తెలిపాడు.

గంగూలీ కెప్టెన్సీలో జాతీయ జ‌ట్టులోకి వ‌చ్చానని తెలిపారు. తాను విసిరిన తొలి రెండు బంతులు వైడ్స్ అయినా ఏం అన‌లేదని తనని వెన్నుతట్టి ప్రోత్సహించాడని తెలిపారు.టెక్నిక‌ల్‌గా రాహుల్ ద్ర‌విడ్‌ను మించిన సార‌థి మ‌రొక‌రు ఉండ‌ర‌ని.. మ్యాచ్‌ను చ‌ద‌వ‌డంలో మ‌హేంద్ర సింగ్ ధోనీ మాస్ట‌ర్ అని ఆర్పీ కొనియాడాడు.

- Advertisement -