సీఎం సహాయనిధికి భారీగా విరాళాలు..

248
errabelli
- Advertisement -

కరోనా వ్యాప్తి నివారణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు ఉపయోగపడేందుకు పలువురు శనివారం విరాళాలు అందించారు. వరంగల్ జిల్లా నర్సంపేటలోని కరని స్పైసెస్ ముఖ్యమంత్రి సహాయ నిధికి 2 లక్షల 11 వేల రూపాయల విరాళం ప్రకటించింది. దీనికి సంబంధించిన చెక్కును మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రగతిభవన్ లో శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందించారు.

వరంగల్ జిల్లాలోని నెల్లికుదురు మండలం వావిలాల గ్రామ సర్పంచ్ గంటా పద్మభాస్కర్ ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 వేల రూపాయల విరాళం ప్రకటించారు. దీనికి సంబంధించిన చెక్కును మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రగతిభవన్ లో శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందించారు.

వరంగల్ జిల్లా పరకాలకు చెందిన అంగన్ వాడీటీచర్లు కె. ప్రసన్నరాణి, వై.రమాదేవి, కె. కవిత 10 వేల రూపాయల విరాళం ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం ప్రకటించారు.

అంగన్ వాడీలో పనిచేసే ఆయా బాలోజి లక్ష్మి 3 వేల రూపాలయ విరాళం ప్రకటించారు. దీనికి సంబంధించిన చెక్కును పరకాల ఎమ్మెల్యే పరకాల ప్రభాకర్ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కు అందించారు.

- Advertisement -