ఆమిర్ ఖాన్ నటించిన దంగల్ చిత్రం శుక్రవారమే విడుదలైంది. రెజ్లర్ మహవీర్ ఫోగట్ జీవిత కథతో తెరకెక్కిన ఈ చిత్రం విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. భారీ రికార్డులపై కన్నేసిన ఈ చిత్రం అంతలోనే సోషల్ మీడియాలో లీక్ కావడం కలకలం సృష్టించింది. ఆమిర్ ఖాన్ కీలక పాత్రలో నటించిన ‘దంగల్’ సినిమా పైరసీకి గురైంది. ఈ సినిమా పూర్తి వీడియోను ఓ వ్యక్తి తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ను బట్టి చూస్తే.. దుబాయ్‌కి చెందిన హష్మీ తన ఫేస్‌బుక్ ఖాతాలో ‘దంగల్’ పూర్తి వీడియోను పోస్ట్ చేశాడు.
ఓ ఫేస్‌బుక్ యూజర్ సోషల్ మీడియాలో దంగల్ పూర్తి సినిమాను ఉంచగా ఇప్పటికే 4 లక్షల మంది వీక్షించారు, 50 మందికి పైగా దీనిని షేర్ చేశారు. ఆధునిక పైరసీకి ఉదాహారణగా మారిన ఈ ఘటనకు పాల్పడింది ఓ పాకిస్తానీ ఫేస్‌బుక్ యూజర్‌గా గుర్తించారు. అయితే ఈ వీడియోను ప్రస్తుతం తొలగించారు. సోషల్‌మీడియాలో ఈ తరహా పైరసీలు చోటు చేసుకోవడం ఇదే మొదటి సారి కాదు. ఇంతకుముందు మేవెదర్, పకియావ్‌ల మధ్య జరిగిన బాక్సింగ్ మ్యాచ్‌ను సైతం పెరిస్కోప్‌లో యూజర్లు లైవ్ స్ట్రీమింగ్ చేశారు. ఈ ఘటనతో పెరిస్కోప్ యూజర్లకు కఠినమైన నియమనిబంధనలు తీసుకొచ్చింది.