మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న `ఖైదీనంబర్ 150` సంక్రాంతి కానుకగా రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టీజర్లు, మేకింగ్ వీడియో సహా `అమ్మడు లెట్స్ డు కుమ్ముడు` సుందరి ఆడియో సాంగ్‌కి ప్రేక్షకాభిమానుల నుంచి అద్భుత స్పందన వస్తోంది. మెగాస్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. జనవరి 4న విజయవాడలో `ఖైదీనంబర్ 150` ప్రీరిలీజ్ ఫంక్షన్..అభిమానులు, సినీప్రముఖుల మధ్య గ్రాండ్‌గా జరగనుంది.

ఈ విషయాన్ని చిత్రనిర్మాత మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ అధికారికంగా ప్రకటించారు. 2017 మోస్ట్ ఎవైటింగ్ మూవీ `ఖైదీనంబర్ 150` కొత్త సంవత్సరాన్ని కొత్తగా ప్రారంభించబోతున్న సందర్భంగా చిత్రనిర్మాత చరణ్ ప్రేక్షకాభిమానులకు క్రిస్మస్, కొత్తసంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ సందర్బంగా `ఖైదీనంబర్ 150` నుంచి `సుందరి..` సాంగ్ లాంచ్ అయిన సంగతి విదితమే. ఆడియో వేడుక తో కాకుండా డైరెక్టర్ సాంగ్స్ ను మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. కాజల్ కథానాయికగా నటిస్తున్నారు. రత్నవేలు ఛాయాగ్రహణం, దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు తరుణ్ అరోరా విలన్ పాత్రలో నటిస్తున్నారు.

