సెల్యూట్ చేసిన చరణ్‌..

122
Dhruva

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోగా, గీతాఆర్ట్స్ బ్యాన‌ర్‌పై స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్‌, నిర్మాత ఎన్‌.వి.ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మించిన స్ట‌యిలిష్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `ధృవ‌. ఈ సినిమా డిసెంబ‌ర్ 9న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజైంది. సినిమా స‌క్సెస్ అయిన సంద‌ర్భంగా శుక్ర‌వారం చిత్ర‌యూనిట్ సెల్యూట్ టు ఆడియెన్స్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు.

Dhruva

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ మాట్లాడుతూ..నేను, అల్లు అర‌వింద్‌గారు ధృవ సినిమా మాతృక చూసి తెలుగులో చేయాలనుకోగానే డైరెక్టర్‌గా సురేంద‌ర్‌రెడ్డి ఒప్పుకోవడం సినిమాకు పెద్ద ఎసెట్ అయ్యింది. బాహుశా మ‌గ‌ధీర త‌ర్వాత మా కాంబినేష‌న్‌లో ఇలాంటి ఓ మంచి క‌థ‌తో సినిమా రావ‌డానికి నాలుగేళ్ల స‌మ‌యం ప‌ట్టింది. నేను, మామ అల్లు అర‌వింద్ సినిమా చేస్తే ఎక్కువ‌గా ఆనంద‌ప‌డేది మా అమ్మ‌గారే. ఆమె ఆనందం కోసం సినిమా పెద్ద హిట్ కావ‌డం ఇంకా హ్య‌పీగా ఉంది. నా ఫ్రెండ్స్ గా చేసిన‌ వాళ్లంద‌రికీ ధ‌న్య‌వాదాలు తెలిపారు.

పోసాని చాలా మంచి పాత్ర చేశారు. హిప్ హాప్ సంగీతం చాలా బావుంది. త‌న బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో సినిమా ఇంకో లెవ‌ల్‌కి వెళ్లింది. త‌న‌తో భ‌విష్య‌త్తులో ప‌నిచేయాల‌ని నాకు అనిపిస్తోంది. హిప్ హాప్ పాట‌ల‌కు డ్యాన్స్ చేయ‌లేక చ‌చ్చిపోయాను. ఈ సినిమా కోసం నేను ప్రేక్ష‌కుల‌కు, మీడియాకు ధ‌న్య‌వాదాలు చెప్పుకోవాలి. ప‌రేషాన్ పాట‌లో ర‌కుల్‌ను చూసి నా అభిమానులు చొక్కాలు చించుకున్నారు. నేను నెంబ‌ర్స్ ని, సీట్ల‌ని ప‌ట్టించుకోను. వాటిని ప‌ట్టించుకుంటే కొత్త క‌థ‌లు రావు. అలాగే రికార్డుల‌ను గురించి కూడా ప‌ట్టించుకోను“ అని అన్నారు.

Dhruva

అల్లు అర‌వింద్ మాట్లాడుతూ “రిలీజ్ చేయాల్సి వ‌చ్చిన‌ప్పుడు చాలా మ‌థ‌న‌ప‌డ్డాం. ఓ వైపు పెద్ద నోట్లు ర‌ద్ద‌య్యాయి, మ‌రో వైపు వ‌చ్చే నెల్లో చిరంజీవిగారి చిత్రం వ‌స్తుంది, మ‌రి ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేయాల‌ని చాలా ఆలోచించాం. చాలా మంది సంక్రాంతి త‌ర్వాత విడుద‌ల చేయ‌మ‌న్నారు. కానీ నేను, చ‌ర‌ణ్ క‌లిసి ధైర్యం చేశాం. రిస్క్ చేశాం. ఆ స‌మ‌యంలో మా మ‌న‌సుల్లో ఎలాంటి భావాలుంటాయో అర్థం చేసుకోండి. అలాగే ఈ ఏడాది నాకు వ్య‌క్తిగ‌తంగా చాలా బావుంది. గీతాఆర్ట్స్ బ్యాన‌ర్‌లో స‌రైనోడుతో బ‌న్నితో, శ్రీర‌స్తు శుభ‌మ‌స్తుతో శిరీష్ ఇప్పుడు ధృవ‌తో చ‌ర‌ణ్ హిట్ మూవీస్ చేయ‌డం నాకు ఎంతో ఆనందంగా ఉంది. మ‌గ‌ధీర త‌ర్వాత మ‌ర‌లా అంత పెద్ద హిట్ సినిమా చేద్దామ‌నుకున్నాను. అది ఈ సినిమాతో కుదిరినందుకు చాలా ఆనందంగా ఉంది. చ‌ర‌ణ్ కెరీర్‌లో టాప్ గ్రాస‌ర్లు రెండూ గీతా ఆర్ట్స్ లోనే ఉండ‌టం ఆనందంగా ఉంది“ అని చెప్పారు.

ర‌కుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ “మంచి క‌థ ఉంటే సినిమాల‌ను ఆద‌రించ‌డానికి ప్రేక్ష‌కులు ఎప్పుడూ ముందుకొస్తార‌ని మ‌రో సారి నిరూపించిన చిత్ర‌మిది. త‌మిళ్ క‌న్నా తెలుగు సినిమాను చూసి ఎంజాయ్ చేశామ‌ని చాలా మంది చెప్పారు. 50 కోట్ల‌ను దాటిన ఈ సినిమా 100 కోట్ల‌ను కూడా దాటాలి“ అని తెలిపారు.

డైర‌క్ట‌ర్ సురేంద‌ర్‌రెడ్డి మాట్లాడుతూ “ఈ టైమ్‌లోనూ మాకు హిట్ ఇచ్చిన ఆడియ‌న్స్ కి థాంక్స్. ఈ సినిమాను సెల‌క్ట్ చేసుకోవ‌డ‌మే గొప్ప‌. చ‌ర‌ణ్ ఈ సినిమాను చేయాల‌ని ఫిక్స్ అయ్యాడు. హీరో ఈ స్టెప్ తీసుకోక‌పోతే ఈ సినిమా వ‌చ్చేది కాదు. ఈ సినిమాను మొద‌లుపెట్టిన‌ప్పుడు స‌గం మంది కరెక్ట్ అన్నారు. స‌గం మంది వ‌ద్ద‌న్నారు. కానీ హీరో, నిర్మాత‌లు న‌మ్మి ముంద‌డుగేశారు. న‌వీన్ చాలా బాగా ఎడిట్ చేశాడు. ఈ సినిమాతో త‌ను నాకు ఫ్రెండ‌య్యాడు“ అని అన్నారు.