కరోనా వ్యాక్సిన్‌ వచ్చేసింది..!

371
coronavirus
- Advertisement -

కరోనా ఈ పేరు వింటేనే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. చైనాలో మొదలైన ఈ వైరస్ ఇప్పటివరకు దాదాపు 165 దేశాలకు పాకింది. కరోనా దెబ్బకు ఆర్ధిక వ్యవస్థ మొత్తం అతలాకుతలం కాగా దీనికి వ్యాక్సిన్స్ ఎప్పుడు వస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అలాంటి వారికి ఇది నిజంగానే శుభవార్త. కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ప్రపంచ శాలు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తుండగా ఈ విషయంలో అగ్రరాజ్యం అమెరికా ముందడుగు వేసింది. కరోనా వైరస్ కి వాక్సిన్ ని తయారు చేసి తొలి ట్రయల్‌గా ఓ మహిళపై ప్రయోగించింది.

సియాటిల్‌కు చెందిన 43 ఏళ్ళ మహిళ హాల్లెర్‌పై వాక్సిన్‌ను తొలిసారి ప్రయోగించామని అమెరికా అధికారికంగా ప్రకటించింది. అదే మహిళకు రెండో ఇంజెక్షన్‌ కూడా ఇచ్చామని స్పష్టం చేసింది. మార్చి 16వ తేదీన కరోనా వాక్సిన్‌ను ప్రయోగాత్మకంగా వినియోగించామని, సియాటిల్‌లోని కైజర్ పెర్మనెంట్ వాషింగ్టన్ హెల్త్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో ఈ ప్రయోగం జరిగిందని అమెరికా వివరించింది.

ఈ వాక్సిన్ ప్రాథమిక దశలో విజయవంతమైతే.. తరువాతి దశలో అమెరికా, చైనా, దక్షిణ కొరియాలలో ప్రయోగించి చూస్తామని లాబొరేటరీ నిర్వాహకులు చెబుతున్నారు.

- Advertisement -