ప్ర‌భాస్ ‘జాన్‌’ నుండి ఫ‌స్ట్ లుక్ వచ్చేస్తోంది..!

571
- Advertisement -

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్ర‌భాస్ ఇటీవ‌ల సాహో చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం ఆడియ‌న్స్ మ‌న‌సులు గెల‌వలేకపోయింది. ఈ నేప‌థ్యంలో ఫ్యాన్స్ ప్ర‌భాస్ 20వ చిత్రం కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ రూపొందుతోంది. ఇటీవలే భారీస్థాయిలో హైదరాబాద్ లో వేసిన ప్రత్యేకమైన సెట్స్ లో ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు.

pooja hegde

ఈ సినిమాలో ప్రభాస్ జోడీగా పూజా హెగ్డే కనిపించనుంది. అయితే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళి చాలా రోజులే అవుతున్న‌ప్ప‌టికీ, ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి అప్‌డేట్ లేదు. దీంతో అభిమానులు నిరాశ‌లో ఉన్నారు. ఇలాంటి స‌మ‌యంలో చిత్ర బృందం ఉగాది కానుక‌గా ప్ర‌భాస్ 20వ చిత్ర టైటిల్‌తో పాటు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ రివీల్ చేయాల‌ని అనుకుంటున్న‌ట్టు తెలుస్తుంది. ఈ సినిమాకి ‘జాన్’ అనే టైటిల్ తో పాటు, ‘ఓ డియర్’ .. ‘రాధే శ్యామ్’ అనే టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు చిత్ర బృందం. ఏడాది చివ‌రలో చిత్రం రిలీజ్ కానునట్లు సమాచారం.

- Advertisement -