జ్యోతిరాదిత్య సింధియా…మధ్యప్రదేశ్ రాజకీయాల్లోనే దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాడు. 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చడంలో కీరోల్ పోషించనున్నాడు. కాంగ్రెస్ ప్రచార సారధిగా ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన సింధియా…ఇప్పుడు కమల్‌నాథ్ సర్కార్‌ని కుప్పకూల్చేందుకు సిద్ధమయ్యాడు.
తనవర్గం ఎమ్మెల్యేలో బీజేపీలో చేరనున్నాడు సింధియా. ఈ మేరకు ప్రధాని మోడీతో భేటీ అయిన సింధియా తర్వాత కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. ట్విట్టర్ ద్వారా తన రాజీనామా లేఖను సోనియాకు పంపించిన సింధియా…రాష్ట్ర ప్రజలకు సేవచేయాలన్నదే తన లక్ష్యమని ప్రకటించారు.
కాంగ్రెస్ సీనియర్ నేత,దివంగత మాధవరావు కుమారుడే జ్యోతిరాదిత్య సింధియా.నేడు ఆయన 75వ జయంతి. కేంద్రమంత్రిగా పనిచేసిన ఆయన మధ్యప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్రవేశారు. కాంగ్రెస్ ఇప్పటికీ ఆయన గురించి గొప్పగానే చెప్పుకొంటోంది. అలాంటిది ఆయన జయంతి రోజునే కొడుకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేయబోతున్నారు.