కోవిద్ 19 ఎఫెక్ట్: అజ్లాన్‌ షా టోర్నీ వాయిదా

379
azlan shah hocket tournment
- Advertisement -

కరోనా ఈ పేరు చెబితేనే ప్రపంచదేశాలు వణికిపోతున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు చైనాకే పరిమితమైన ఈ వైరస్ ఇప్పుడు దక్షిణ కొరియా, ఇరాన్ దేశాల్లో విజృంభిస్తోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 3,119 మంది చనిపోగా 90 వేలకు పైగా ఈ మహమ్మారి భారిన పడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

కరోనా ధాటికి స్టాక్ మార్కెట్లు సైతం కుప్పకూలగా ప్రతిష్టాత్మక స్పోర్ట్స్ టోర్నమెంట్స్ సైతం వాయిదా పడుతున్నాయి. తాజాగా అజ్లాన్ షా హాకీ టోర్నమెంట్ వాయిదా పడింది. ఏప్రిల్ 11 నుంచి మలేసియాలోని ఐఫోలో ఈ టోర్నీ జ‌ర‌గాల్సి ఉంది. అయితే క‌రోనా వైర‌స్ ఉధృతి కార‌ణంగా ఈ టోర్నీని వ‌చ్చే సెప్టెంబ‌ర్‌కు వాయిదా వేస్తున్న‌ట్లు నిర్వాహ‌కులు ప్ర‌క‌టించారు.

హ‌కీ క్రీడ‌లో అజ్లాన్ షా టోర్నీకి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ టోర్నీని భార‌త్ నాలుగుసార్లు నెగ్గింది. సెప్టెంబ‌ర్ 24 నుంచి అక్టోబ‌ర్ 3 వ‌ర‌కు ఈ టోర్నీని రీ షెడ్యూల్ చేసిన‌ట్లు పేర్కొన్నారు. ఇప్పటికే షాంఘైలో జ‌ర‌గాల్సిన చైనీస్ గ్రాండ్‌ప్రి, ఆసియా బాక్సింగ్ క్వాలిఫ‌య‌ర్స్‌, ప్ర‌పంచ టేబుల్ టెన్నిస్ చాంపియ‌న్‌షిప్ లాంటి ప్ర‌తిష్టాత్మ‌క టోర్నీలు వాయిదా ప‌డ్డాయి.

- Advertisement -