బిగ్ రిలీఫ్: సునీతా కృష్ణన్‌కు కరోనా నెగటీవ్

322
sunitha krishnan
- Advertisement -

తన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లను నమ్మవద్దని ట్విట్టర్ ద్వారా కోరారు మహిళల హక్కుల పోరాట నాయకురాలు సునీతా కృష్ణన్. తనకు గాంధీ ఆస్పత్రిలో కరోనా పరీక్షలు జరిగాయని ట్విట్టర్ ద్వారా వెల్లడించిన ఆమె కరోనా వైరస్ పరీక్షా ఫలితాలు వచ్చాయని, నెగటీవ్ అని తేలిందని తెలిపారు. దీంతో తనకు బిగ్ రిలీఫ్ లభించిందన్నారు.

తాను బ్యాంకాక్ నుంచి వచ్చినప్పటి నుండి దగ్గుతో బాధపడుతున్నానని పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి వెళ్లానని చెప్పారు. తన ఆరోగ్యంపై బాగానే ఉందని గాంధీ ఆస్పత్రిలో వైద్యం గురించి చాలామంది అడిగారని ఇక్కడి వైద్యులు మంచి వైద్యం అందించారని చెప్పారు. ముఖ్యంగా డాక్టర్ సయిద్ అబ్దుల్ హబిబ్ తన ఆరోగ్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పారు. గతంలో సునీతా కృష్ణన్‌‌కు పద్మశ్రీ పురస్కారం లభించిన సంగతి తెలిసిందే.

- Advertisement -