ప్రభాస్ తో మహేశ్ బాబు దర్శకుడు!

393
prabhas new film
- Advertisement -

సూపర్ స్టార్ మహేశ్ బాబు వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు.మహేశ్ బాబు హీరోగా అనీల్ రావిపూడి దర్శకత్వం వహించిన సరిలేరు నీకెవ్వరు సినిమా వసూళ్ల పరంగా రికార్డులు సృష్టించింది . ఈమూవీ తర్వాత మహేశ్ బాబు ఎవరితో సినిమా చేయనున్నాడని ఆసక్తి నెలకొంది. మహేశ్ బాబుకు మహర్షి లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చిన వంశీ పైడిపల్లి దర్శకత్వం లో తర్వాతి సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి. దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా ఈ విషయాన్నీ ప్రకటించాడు.

తాజాగా ఉన్న సమాచారం మేరకు మహేశ్ బాబు మరో దర్శకుడితో సినిమా చేయనున్నట్లు ఫిలిం నగర్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మహేశ్ నో చెప్పడంతో ఇదే కథను ప్రభాస్ కు వినిపించాడట దర్శకుడు వంశీ పైడిపల్లి. ప్రభాస్ కు కథ నచ్చడంతో వెంటనే ఒకే చెప్పేశాడని సమాచారం. గతంలో వంశీ ప్రభాస్ తో ‘మున్నా’ అనే సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. కాగా ప్రభాస్ ప్రస్తుతం జాన్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

- Advertisement -