భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర..

609
lpg gas
- Advertisement -

సామన్యుడికి మరోషాక్‌ తగిలింది..వంట గ్యాస్ ధర మళ్లీ భారీగా పెరిగింది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరల పెంపుతో అల్లాడుతున్న సామన్యుడిపై గ్యాస్ సిలిండర్ ధరలు అధిక భారాన్ని మోపనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ రంగంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు ఓ ప్రకటన చేశాయి. ఇప్పుడున్న ధర కన్నా వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర 149 రూపాయలు పెరగనుంది.

కాగా పెరిగిన ధర ఈ రోజు నుండి అమల్లోకి రానుంది. ధర పెంపు వల్ల వినియోగదారుడిపై అదనంగా 7 రూపాయాల భారం పడే అవకాశముంది. గత ఆగస్టు నుంచి సిలిండర్ ధరను కంపెనీలు ప్రతీ నెల పెంచుతున్నాయి. ఈ క్రమంలో తాజా పెంపు 6వది. చివరిసారిగా జనవరి 1న సిలిండర్ ధరను రూ.19 పెంచాయి.. ఈ పెంపు సామాన్యుడి బడ్జెట్ కు ప్రతిబంధంకంగా మారాయి.

ఈ పెంపు ఆయా ప్రాంతాలను బట్టి 149 రూపాయల వరకు ఉండనుంది. ఈ పెంపు వల్ల ఢిల్లీలో 14.2 కిలోల సిలిండర్ ధర రూ.858.50 చేరింది. కాగా సబ్సిడీ కింద వినియోగదారులకు ఇచ్చే మొత్తం రూ.153.86 నుంచి 291.48కు పెంచారు. ఇక కోల్‌కతాలో సిలిండర్ ధర రూ. 896కు చేరుకొని.. సుమారు రూ.149 పెరిగింది. ముంబైలో అయితే 14.2 కేజీల నాన్ సబ్సిడీ ఎల్‌పీజీ సిలిండర్ ధర ఇప్పుడు రూ.829 కాగా, రూ.145 మేర ధర పెరిగింది. అలాగే చెన్నైలో కొత్త ధర రూ.881కు చేరుకుంది. 2020, జనవరి 1 తర్వాత గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

- Advertisement -