భారీగా పెరిగిన వంట గ్యాస్ ధ‌ర‌..

116
LPG cylinder prices

వంట గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌ రోజు రోజు మరింత భారమౌతుంది. నాలుగు రోజుల వ్యవధిలో రెండోసారి వంటగ్యాస్‌ ధరను పెంచాయి. గత మూడు నెలల వ్యవధిలో గ్యాస్‌ బండపై రూ.225 పెరిగింది. తాజాగా ఈరోజు వంటగ్యాస్‌పై రూ.25, వాణిజ్య సిలిండర్‌పై రూ.95ను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణ‌యం తీసుకున్నాయి. ఈ ధ‌ర‌లు వెంట‌నే అమ‌ల్లోకి వ‌చ్చాయి. ఈ నెల 25వ తేదీన‌ వంట‌గ్యాస్ సిలిండ‌ర్‌పై రూ.25 పెంచిన విష‌యం తెలిసిందే. అనంత‌రం‌ 4వ తేదీన సిలిండ‌ర్‌పై రూ.25 పెరిగింది. ఆ త‌ర్వాత 15వ తేదీన మ‌రో రూ.50 పెరిగింది. నాలుగుసార్లు గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌లను పెంచడంలో ఈ నెల‌లో మొత్తం రూ.125 పెరిగిన‌ట్ల‌యింది.

గత డిసెంబర్‌ 1న 14 కిలోల సిలిండర్‌ ధర రూ.594గా ఉన్నది. రూ.50 పెంచడంతో రూ.644కు చేరింది. మళ్లీ జనవరి 1న రూ.50 వడ్డించడంతో అది రూ.694కు పెరిగింది. అంతటితో ఆగని కంపెనీలు ఫిబ్రవరి 4న రూ.25 పెంచాయి. దీంతో సిలిండర్‌ ధర రూ.719కి చేరింది. అదేనెలలో పదిరోజుల వ్యవధిలోనే మరో రూ.50 మేర వినియోగదారులపై భారం మోపాయి. ఫిబ్రవరి 14న రూ.50 పెంపుతో రూ.769 పెరిగింది. చివరగా ఫిబ్రవరి 25న రూ.25 మేర గ్యాస్‌ ధరను అధికం చేయడంతో రూ.794కు చేరింది. తాజాగా మరో రూ.25 వడ్డించడంతో సిలిండర్‌ వెల రూ.819కి పెరిగింది.