అల్లు అర్జున్ పాటకు స్టెప్పులేసిన బాలీవుడ్ బ్యూటీ

374
Buttabomma
- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన అల..వైకుంఠపురంలో చిత్రం భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈచిత్రం ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. తమన్ అందించిన సంగీతం ఈమూవీకి హైలెట్ గా నిలిచింది. ఈసినిమాలోని పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈసినిమాలోని పాటలు యూట్యూబ్ లో ట్రెండింగ్ లో నిలిచాయి. అంతేకుకుండా వంద మిలియన్ల వ్యూస్ ను రాబట్టాయి.

ఇక పోతే టిక్ టాక్, వాట్సప్ స్టేటస్ లలో ఈమూవీ సాంగ్స్ మార్మోగుతున్నాయి. . తాజాగా బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి, ఆమె సోద‌రి ష‌మితా శెట్టి టిక్ టాక్‌లో బుట్ట‌బొమ్మ సాంగ్‌కి స్టెప్పులేసి నెటిజ‌న్స్‌ని అల‌రించారు. ఇప్పుడు ఈ టిక్ టాక్ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తుంది. ఇకపోతే ‘అల వైకుంఠపురములో’ సినిమాకు ఓ పక్క సీక్వెల్, మరో పక్క రీమేక్ ప్లాన్ చేస్తున్నారు. ‘కబీర్ సింగ్’ నిర్మాత అశ్విన్ వార్దే ఈ సినిమాను గీతా ఆర్ట్స్ నుంచి ఎనిమిది కోట్లు రూపాయలు పెట్టి రీమేక్ రైట్స్ దక్కించుకున్నారట.

- Advertisement -