అఘోరాగా బాలయ్య !

576
nandamuri balakrishna
- Advertisement -

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో మూడో సినిమా చేస్తున్నాడు. వీరిద్దిరి కాంబినేషన్ లో తెరకెక్కిన సింహా, లెజెండ్ చిత్రాలు భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈమూవీ పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. కొద్ది రోజుల క్రితమే ఈమూవీ షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా దర్శకుడు బోయపాటి కుటుంబ సభ్యుడు మరణించగా ఈమూవీ షూటింగ్ ప్రారంభంకు కాస్త ఆలస్యమైంది. ఈనెల 26నుంచి రెగ్యూలర్ షూటింగ్ ను ప్రారంభించనున్నారు.

వారణాశిలో బాలయ్య పై కొన్ని సీన్లను తెరకక్కించనున్నారు. ఈ సినిమాలో రెండు కోణాల్లో కనిపించే బాలయ్య, ఓ పాత్రలో అఘోరాగా కనిపిస్తారని టాలీవుడ్ సమాచారం.చిత్రంలో బాలకృష్ణ అఘోరాగా కనిపించే సన్నివేశాలు అత్యంత కీలకమని సినీ వర్గాల సమాచారం. ఇక బాలయ్య సరసన క్యాథరిన్ నటించనున్నట్లు తెలుస్తుంది. ఇటివలే బాలయ్య నటించిన రూలర్ సినిమా భారీ డిజాస్టర్ గా నిలవడంతో ఈమూవీపై తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈసినిమాలో పెద్ద ఎత్తున అంచానాలున్నాయి.

- Advertisement -