యువ హీరో నాగశౌర్య మెహరిన్ జంటగా నటించిన చిత్రం అశ్వద్దామ. కొన్ని యదార్థ సంఘటనల స్ఫూర్తితో తాను ఈ కథను తయారుచేసుకున్నానని, నేటి సమాజంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టే విషయంలో జాగరూకతను పెంచే చిత్రమిదని ప్రచార సందర్భంలో చెప్పారు నాగశౌర్య. తన సొంత బ్యానర్లో నిర్మించిన ఈసినిమాకు కథను కూడా నాగశౌర్య అందించడం విశేషంగా చెప్పుకోవచ్చు.. కెరీర్ మొదటి నుంచి ప్రేమకథా చిత్రాల్లోనే నటించారు నాగశౌర్య, అయితే ఈ యువ హీరో తొలిసారిగా క్రైమ్ థ్రిల్లర్ లో నటించారు. చాలా అంచనాలతో ఈమూవీని చేశాడు నాగశౌర్య. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఏమేరకు మెప్పించిందో చూద్దాం.
కథః
గణ (నాగశౌర్య) చెల్లెలు ప్రియా(సర్గుణ్ కౌర్). గణ కు చెల్లులు అంటే చాలా ఇష్టం. అయితే రవి (ప్రిన్స్ తో ) ప్రియకు పెళ్లి సంబంధం కుదురుతుంది. అయితే పెళ్లికి కొద్ది రోజుల ముందు ప్రియ ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించడాన్ని గణ చూస్తాడు. దీంతో వెంటనే చెల్లి దగ్గరకు వెల్లి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు అడుగుతాడు. తాను గర్భవతిననే షాకింగ్ నిజాన్ని వెల్లడిస్తుంది ప్రియ. అయితే అందుకు ఎవరు కారణమో తనకు తెలియదని చెబుతుంది. ఈలోగా విశాఖపట్నం నగరంలో చాలా మంది అమ్మాయిల మిస్సింగ్ కేసులు నమోదు అవుతుంటాయి. తన చెల్లితో పాటు ఇంకెదరో యువతులు ఇలాంటి ఘటనలే ఎదుర్కోవడాన్ని గణ తన ఇన్వెస్టిగేషన్‌లో తెలుసుకుంటాడు. ఇదంతా చేస్తుంది ఎవరు? నేహ (మెహరీన్)కు గణ కుటుంబానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ఈ కథలోకి డాక్టర్ మనోజ్‌కుమార్ (జిష్షు సేన్ గుప్తా), సత్య, పోసాని, తదితరలు ఎందుకు ఎంటర్ అవుతారు? చివరికి ఈ మిస్టరీ వెనుక ఉన్నది ఎవరో గణ తెలుసుకుంటాడా? చివరికి ఏమైంది? అనేదే అసలు సినిమా కథ.
ప్లస్ పాయింట్స్ః
ఈసినిమాకు నాగశౌర్య అందించిన కథ ప్రధాన బలం అని చెప్పుకోవాలి. దర్శకుడు రమణ తేజ చాలా చక్కగా ఈసినిమాను తెరకెక్కించాడు. ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా, నెక్ట్స్ ఏంజరుగుతుంది అనే కుతూహలం సగటు ప్రేక్షకుడికి ఏర్పడే విధంగా ఫస్టాఫ్ సాగుతుంది. అయితే హీరోయిన్‌తో వచ్చే సీన్లు, పాటలు ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టే విధంగా ఉంటాయి. అయితే సెకండాఫ్‌లో కూడా కథను ఎక్కడా డీవియేట్ కాకుండా? అనవసర హంగుల జోలికి వెళ్లకుండా రెండో అర్థభాగాన్ని చాలా బాగా హ్యాండిల్ చేశాడు దర్శకుడు. స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. మనోజ్ రెడ్డి కెమెరా పనితనం తెరపై కనిపిస్తుంది. హీరోయిన్ అందాలు, యాక్షన్ సీన్లలో మనోజ్ తన సినిమాటోగ్రఫీతో మైమరిపించాడు. ఇక జిబ్రాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. కొన్ని సీన్లలో సైలెంట్ మ్యూజిక్.. మరికొన్ని చోట్ల హార్ట్ బీట్‌ను పెంచే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించాడు. నటీనటులు అందరూ బాగా నటించారు. కథానాయిక మెహరీన్ పరిమితమైన పాత్రలో కనిపించింది. ఆమె పాత్రకు ఎక్కువగా స్కోప్‌లేకుండా పోయింది. హీరో చెల్లెలు పాత్రలో సర్గుణ్ మంచి అభినయానికి కనబరచింది. ప్రిన్స్, పోసాని, సత్య..ఇతరులు తమ పాత్రల్లో ఫర్వాలేదనిపించారు. ఇక నిర్మాత ఉషా ముల్పూరి ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు.
మైసన్ పాయింట్స్ః
కథలో కొత్తదనం లేకపోవడం సినిమాకు కాస్త మైనస్ గా చెప్పుకోవచ్చు.. ఇక హీరోయిన్ మెహరిన్ కు ఎక్కవగా స్పేస్ లేకపోవడం. పైగా హీరోయిన్ క్యారెక్టర్ కు పెద్దగా ఇంపార్టెస్ ఇవ్వలేదు. సెకండాఫ్ కాస్త స్లోగా ఉండటం వల్ల కాస్త బోరింగ్ అనిపిస్తుంది.
తీర్పుః
ఛలో మూవీ తర్వాత ప్లాప్ లతో సతమతమవుతున్న నాగశౌర్య ఈ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడని చెప్పుకోవాలి. ఎప్పుడు ప్రేమకథ చిత్రాల్లో నటించే నాగశౌర్య కొత్త లుక్ లో ఆకట్టుకున్నాడు. కథలో కొత్తదనం లేకపోయినా క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌ను ఇష్టపడే ప్రేక్షకుల్ని మెప్పిస్తుందీ చిత్రం.
విడుదల తేదీ: 31/01/2020
రేటింగ్: 2.75/5
నటీనటులు: నాగశౌర్య, మెహరీన్, సర్గుణ్‌కౌర్, జిషూసేన్ గుప్తా
సంగీతం: శ్రీచరణ్ పాకాల
నిర్మాతలు: ఉషా ముల్పూరి
దర్శకత్వం: రమణతేజ