భాషా సినిమా చూసిన కరుణానిధి..

236
Karunanidhi watches Baasha movie
- Advertisement -

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ కరుణానిధి ఐసీయూలో చికిత్స పొందుతున్నారని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెన్నైలోని కావేరీ ఆసుపత్రి వర్గాలు చెప్పాయి. కరుణానిధికి ప్రస్తుతం వాయు నాళంలో రంధ్రం పెట్టి శ్వాస అందిస్తూ (Tracheostomy) చికిత్స చేస్తున్నామని కావేరీ ఆసుపత్రి వర్గాలు చెప్పాయి. గొంతు, ఊపిరితిత్తుల ఇన్పెక్షన్ కారణంగా శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని డాక్టర్లు తెలిపారు.

అయితే, సర్జరీ అనంతరం కరుణానిధి..సూపర్ స్టార్ రజనీ కాంత్ సినిమా చూశారని డిఎంకే ఛానల్‌లో వార్తలు ప్రసారమయ్యాయి. 1995లో విడుదలైన రజనీ సూపర్ హిట్ సినిమా భాషాను ల్యాప్‌ టాప్‌లో చూశారని ఆ ఛానల్‌ వెల్లడించింది. మరోవైపు వివిధ పార్టీల నేతలు కావేరి ఆస్పత్రికి చేరుకుని కరుణానిధి ఆరోగ్యంపై ఆరా తీశారు. ఆయన ఆరోగ్యం కోలుకుందని…కుర్చిలో కూర్చుంటున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇక డీఎంకే కార్యకర్తలు సైతం పెద్ద ఎత్తున ఆస్పత్రికి చేరుకుంటున్నారు.

Karunanidhi watches Baasha movie

గత 15 రోజుల్లో కరుణానిధి రెండవ సారి అస్వస్థతకు గురయ్యారు. డిసెంబర్ 1వ తేదీన డీహైడ్రేషన్, అలర్జీ సంబంధిత అనారోగ్య కారణాలతో కరుణానిధి కావేరి ఆస్పత్రిలో చేరారు. వారం రోజుల పాటు చికిత్స పొందిన అనంతరం డాక్టర్లు ఆయన్ను డిశ్చార్జ్ చేశారు. కొన్ని రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించిన విషయం తెలిసిందే.

- Advertisement -