ఆధారాలు ఉన్నాయి..క్షమాపణలు చెప్పను

366
Rajinikanth
- Advertisement -

ద్రవిడ ఉద్యమనేత ద్రవిడార్‌ కజగమ్‌ చీఫ్‌ తంతై పెరియార్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని ద్రవిడ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఈఅంశంపై స్పందించారు రజనీకాంత్. పెరియార్‌ వివాదంపై తాను క్షమాపణలు చెప్పలేనని స్పష్టం చేశారు. వార్తా కథనాల్లో వచ్చిన ఆధారాలతోనే తాను ఆ వ్యాఖ్యులు చేసినట్లు తెలిపారు. కానీ సొంతగా ఊహాజనిత విషయాలేవీ నేను చెప్పలేదు. వాటికి సంబంధించిన క్లిప్లింగ్స్‌ అన్నీ నా దగ్గర ఉన్నాయి.

ఆ ఘటన గురించి నేనేమి చూశానో అదే చెప్పాను అన్నారు. కాగా తుగ్లక్ పత్రికా సంస్ధ 50వ వార్షికోత్సవ వేడుకల్లో రజనీకాంత్ మాట్లాడుతూ..1971లో సాలెం ప్రాంతంలో పెరియార్‌ నిర్వహించిన మహానాడులో శ్రీరాముడి చిత్రపటానికి అవమానం జరగడం వల్లే..పెరియార్‌ సిద్దాంతాలను అనుసరించే డీఎంకే పార్టీ రాజకీయంగా దెబ్బతిన్నదని అన్నారు. అప్పట్లో పెరియార్‌ సీతారాముల ప్రతిమలను నగ్నంగా తీసుకెళ్లారని గుర్తు చేశారు. ఈ వార్తను కేవలం ఒకే ఒక్కతమిళ మేగజైన్‌ ప్రచురించిందని పేర్కొన్నారు.

- Advertisement -