సందీప్ కిషన్ సైడ్ బిజినెస్…

285
- Advertisement -

ఇప్పుడు అందరూ హోటళ్ల బిజినిస్ మీదనే పడ్డారు. అంతేలేండి.. హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ కంపెనీల తరువాత బాగా లాభం తెచ్చే బిజినెస్ లు హోటళ్ళేనట. అసలు కొత్త ఫుడ్ రెస్టారెంట్ వచ్చిందంటే చాలు.. కుర్రాళ్లు అంతా అక్కడే హ్యాంగవుట్ అవుతున్నారు. ఆల్రెడీ నాగార్జున ఎన్-గ్రిల్.. నితిన్ అండ్ నీరజ కోన ల‌ టి-గ్రిల్.. అలాగే హీరో శశాంక్ మాయాబజార్.. అందరికంటే ముందు దర్శకుడు కుచిపుడి వెంక‌ట్ ఉలవచారు.. అనే రెస్టారెంట్ ని స్టాట్
చేశాడు.

Hero Sandeep Kishan Will Start New Venture In Hyderabad

ఇవన్నీ హైదరాబాద్ లో బాగా క్లిక్ అయ్యాయ్. ఇప్పుడు ఇదే గ్రూపులోకి జాయిన్ అవుతున్నాడు హీరో సందీప్ కిషన్. సినిమాల సంగతి ఎలా ఉన్నా ,బిజినెస్ బిజినెస్సే అంటున్నాడు హీరో సందీప్ కిషన్. మనోడు జూబ్లీ హిల్స్ లో ”వివాహ భోజనంబు” అనే రెస్టారెంట్ తెరుస్తున్నాడు. ఇప్పటికేమీడియాలోని కొందరు జర్నలిస్టులను అక్కడకు ఇన్వయిట్ చేసి.. మనోడు నోరూరించే భోజనాలు పెట్టించాడు. అది ఆస్వాదించిన కొందరు.. వావ్ నాన్ వెజ్ మీల్స్ అదిరిపోయింది అంటున్నారు. పైగా మెనూలో ఇంకా చాలా తెలుగు రుచులు ఉన్నాయట. అలాగే హోటల్ లుక్ అండ్ ఫీల్ కూడా అదిరింది అంటున్నారు. ఎంతైనా సినిమా వాళ్ళు కదండీ.. త్వరలోనే ఈ హోటల్ ను గ్రాండ్ గా ఓపెన్ చేస్తారని తెలుస్తోంది.

- Advertisement -